బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క సారి ఫ్లాఫ్ టాక్ వస్తే ఇక ఆ సినిమా పని అయిపోయినట్లే అని భావిస్తారు చాలా మంది. కానీ రీసెంట్ టైం లో కొన్ని ఫ్లాఫ్ అండ్ నెగటివ్ టాక్స్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపాయి. వాటిలో ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ హౌస్ ఫుల్ 4 కూడా చేరింది అని చెప్పొచ్చు.
దీపావళి వీకెండ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో కే బాలీవుడ్ లో ఫుల్ నెగటివ్ రివ్యూ లు దక్కాయి. సినిమా లో అసలు కామెడీ లేదని, రొటీన్ మూవీ ని భారీ బడ్జెట్ తో బాహుబలి రేంజ్ లో తీశారు అంటూ తెగ నెగటివ్ కామెంట్స్ చేశారు.
కట్ చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూడటానికి భారీ లెవల్ లో దీపావళి వీకెండ్ లో వెళ్ళడంతో సినిమా కి మొదటి నాలుగు 5 రోజుల్లోనే 100 కోట్లు రాగా తర్వాత టాక్ స్ప్రెడ్ అవ్వడం తో ఇక తేరుకోలేదు అని అంతా భావించిన టైం లో లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా….
బ్రేక్ ఈవెన్ టార్గెట్ 185 కోట్ల మార్క్ ని అదిగమించగా రీసెంట్ గా 200 కోట్ల క్లబ్ లో చేరి ఇప్పుడు ఫైనల్ గా 208 కోట్ల కు పైగా కలెక్షన్స్ ని అందుకుని ఇప్పుడు కూడా మినిమమ్ కలెక్షన్స్ ని సాధిస్తున్న సినిమా ఓవరాల్ గా 210 కోట్ల మార్క్ ని అందుకోనుంది. దాంతో అక్షయ్ కుమార్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా ఉన్న..
మిషన్ మంగల్ సినిమా 206 కోట్ల కలెక్షన్స్ ని బీట్ చేసి ఇప్పుడు అక్షయ్ కుమార్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచింది ఈ సినిమా. డిసాస్టర్ మూవీ అంటూ నెగటివ్ రివ్యూ లు ఇచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ రికార్డ్ తో దుమ్ము లేపాడు అక్షయ్ కుమార్.