Home న్యూస్ 2019 ఇయర్ లో టాలీవుడ్ టాప్ 5 మూవీస్ ఇవే!!

2019 ఇయర్ లో టాలీవుడ్ టాప్ 5 [50 డేస్] మూవీస్ ఇవే!!

0

  2019 ఇయర్ మరో నెల రోజుల వ్యవధిలో ముగియడానికి సిద్ధం అవుతుంది. ఈ ఇయర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో హిట్ గీత దాటిన సినిమాలు కొన్ని ఉండగా అందులో అతి కొద్ది సినిమాలు మాత్రమె బాక్స్ ఆఫీస్ దగ్గర 50 రోజుల వేడుకని జరుపుకున్నాయి. రెండు మూడు వారాలకే పరుగులు పూర్తీ అవుతున్న ఈ ట్రెండ్ లో సినిమాలు 50 రోజులను థియేటర్స్ లో పూర్తీ చేసుకోవడం గొప్ప విషయం అనే చెప్పాలి.

Tollywood Highest Viewed Lyrical Videos In 24 Hours

ఈ ఇయర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో టాప్ 5 [50 డేస్] సెంటర్స్ మూవీస్ ని గమనిస్తే 5 వ ప్లేస్ లో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా 50 రోజుల వేడుకని సుమారు 5 డైరెక్ట్ సెంటర్స్ లో జరుపుకుని ఈ ఇయర్ టాప్ 5 ప్లేసు ను దక్కించుకుంది.

ఇక 4 వ ప్లేస్ లో నాగ చైతన్య సమంత ల కాంబినేషన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా 50 రోజుల వేడుకని 25 డైరెక్ట్ సెంటర్స్ లో జరుపుకుంది, సమ్మర్ లో పోటి లో సినిమాలు ఉన్నా కానీ ఈ సినిమా లాంగ్ రన్ ని సొంతం చేసుకుని సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మూడో ప్లేస్ లో…

Sye Raa 50 Days Centers

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి 32 డైరెక్ట్ సెంటర్స్ లో 50 రోజుల వేడుకని జరుపుకోగా మరో 2 షిఫ్ట్ సెంటర్స్ లో కూడా 50 రోజుల వేడుకని జరుపుకుని దుమ్ము లేపింది. ఇక రెండో ప్లేస్ లో ఎఫ్ 2 సినిమా 65 డైరెక్ట్ సెంటర్స్ లో 50 డేస్ ని సొంతం చేసుకోగా షిఫ్ట్ సెంటర్స్ తో కలిపి 100 సెంటర్స్ లో 50 రోజులు పూర్తీ చేసుకుంది.

ఇక మొదటి ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా 110 డైరెక్ట్ సెంటర్స్ లో 50 రోజుల వేడుకని జరుపుకోగా షిఫ్ట్ సెంటర్స్ తో కలిపి 200 సెంటర్స్ లో 50 రోజుల వేడుకని పూర్తీ చేసుకుని రీసెంట్ టైం లో నాన్ బాహుబలి రికార్డ్ ను సొంతం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here