యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న లేటెస్ట్ మూవీ జార్జ్ రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రోజు మొత్తం మీద మంచి వసూళ్ళనే సాధించి అన్ సీజన్ అయినా కానీ మంచి ఓపెనింగ్స్ తో ట్రేడ్ కి షాక్ ఇచ్చింది. నైజాం ఏరియాలో సినిమా కి మొదటి రోజు మంచి వసూళ్లు దక్కాయి అని చెప్పాలి.
సినిమా మొదటి రోజు ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 61 లక్షల షేర్ ని వసూల్ చేసింది, వరల్డ్ వైడ్ గా 73 లక్షల షేర్ ని సినిమా సాధించింది. దాంతో తొలిరోజు ఓవరాల్ గా డీసెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న జార్జ్ రెడ్డి వీకెండ్ లో జోరు చూపే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఫస్ట్ డే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి….
?Nizam: 26L
?Ceeded: 7L
?UA: 10.2L
?East: 4L
?West: 3.1L
?Guntur: 4L
?Krishna: 4.5L
?Nellore: 2.1L
AP-TG Day 1:- 0.61Cr
Ka & ROI: 4L
OS: 8L
Total WW: 73L(1.2Cr Gross)
ఇదీ మొత్తం మీద సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్కలు. ఇక సినిమా బిజినెస్ ఎంత అనేది క్లియర్ గా రిలీజ్ చేయలేదు కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా బిజినెస్ 2.25 కోట్ల రేంజ్ లో జరిగిందట. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ కలిపి టోటల్ గా 2.6 కోట్ల మేర బిజినెస్ జరిగిందట.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమం 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఇక మొదటి రోజు 73 లక్షలు రికవరీ అయ్యాయి కాబట్టి లాంగ్ రన్ లో మరో 2.27 కోట్ల షేర్ ని అందుకుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది.