Home గాసిప్స్ ఆ మాస్ నాటు ఫైట్స్ ఏంటి…ఈ క్లాస్ డైరెక్టర్ ఏంటి??

ఆ మాస్ నాటు ఫైట్స్ ఏంటి…ఈ క్లాస్ డైరెక్టర్ ఏంటి??

0

     ఇది మాత్రం ఎవ్వరూ ఊహించని కాంబినేషన్, ఒక కథ కి ఒక డైరెక్టర్ మాత్రమె న్యాయం చేస్తాడు అనిపించేలా కొన్ని కథలు ఉంటాయి. మంచి కుటుంబ నేపధ్యంలో మూవీ అన్నా, మానవ సంబందాలకు గురించి విలువల గురించి చెప్పే కథలకు టాలీవుడ్ లో పెర్ఫెక్ట్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువ మంది చెప్పే పేరు శ్రీకాంత్ అడ్డాల. కెరీర్ లో ఇప్పటి వరకు అలాంటి సినిమా లనే చేశాడు ఈ డైరెక్టర్.

అలాంటిది ఇప్పుడు అసలు ఇలాంటి స్టొరీ కూడా చేస్తాడా అని అనిపించేలా ఒక కథ ని తెలుగు లో రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాడు, దాంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురి అవ్వగా ఈ విషయాన్నీ నిర్మాత కూడా అఫీషియల్ గా కన్ఫాం చేయడం తో మరింత షాక్ అవుతున్నారు.

శ్రీకాంత్ అడ్డాల తెలుగు లో రీమేక్ చేయబోతున్న ఆ సినిమా నే అసురన్, పక్కా రా కంటెంట్ తో మాస్ ఎలిమెంట్స్, భారీగా నరుకుడు లాంటివి ఉన్న సినిమా ఇది. సినిమాలో ముఖ్యంగా ఓ మూడు నాలుగు ఎపిసోడ్స్ పూర్తిగా వీటి పైనే డిపెండ్ అయ్యి ఎమోషన్స్ తో కూడుకుని ఉంటుంది.

అలాంటి కథని వెంకీ తో తెలుగు లో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో అతి త్వరలో ప్రారంభించబోతున్నారట. సినిమా ను వచ్చే సమ్మర్ ని టార్గెట్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దాంతో సోషల్ మీడియా యూత్ మొత్తం అసలు ఆ కథ శ్రీకాంత్ అడ్డాల ఎలా మార్చుతాడు అంటూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

అదే సమయం లో ఒరిజినల్ సినిమా అక్కడ ఆల్ మోస్ట్ కల్ట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది, రీమేక్ తేడా కొడితే ఓ రేంజ్ లో ట్రోల్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది, మరి తనకి నప్పని కథ తో అటు బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ చేయాల్సి ఉంటుంది, ఇటు ఒరిజినల్ ని కూడా మరిపించాల్సి ఉంటుంది. చూద్దాం అడ్డాల ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here