టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎస్ ఎస్ రాజమౌళి ల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాల్లో మూడో సినిమా యమదొంగ రిలీజ్ అయ్యి 12 ఏళ్ళు పూర్తీ కాగా రిలీజ్ అయిన ఇన్నాళ్ళకి సినిమా ఇప్పుడు తమిళ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అయింది. కాగా సినిమా అక్కడ విజయన్ పేరు తో డబ్ చేయగా సినిమా ను అక్కడ సుమారు 90 థియేటర్స్ లో అలాగే 130 స్క్రీన్స్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
కానీ సడెన్ గా సినిమా రిలీజ్ ఆగిపోయింది. దానికి ప్రధాన కారణాలు ఏంటో తెలియరాలేదు కానీ, కొన్ని థియేటర్స్ అగ్రీమెంట్స్ జరగలేదని అలాగే థియేటర్స్ కూడా చాలినన్ని దొరకలేదని కొందరు అంటున్నారు. దాంతో రిలీజ్ ని సడెన్ గా ఆపేశారు.
ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుందో మరో పోస్టర్ ని వదిలారు. ఆ పోస్టర్ ప్రకారం సినిమా ను డిసెంబర్ 13 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొంచం ప్రమోషన్ కూడా చేసి సినిమాను రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఈ సారి కొంచం రిలీజ్ ప్లాన్ మారిందని అంటున్నారు. ఇది వరకు 130 స్క్రీన్స్ లో రిలీజ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఏకంగా అక్కడ సినిమా…
డిసెంబర్ 13 న సుమారు 200 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుందట. సుమారు 160 థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవుతుందని సమాచారం. సినిమా బిజినెస్ అక్కడ 35 లక్షల బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 65 లక్షలకు పైగా గ్రాస్ ని మినిమం వసూల్ చేయాల్సి ఉంటుంది. వచ్చే ఇయర్ ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ కానుంది కాబట్టి.
ఈ సినిమా అక్కడ ఒక ట్రైల్ మ్యాచ్ గా పరిగణలోకి తీసుకోవచ్చు, రామ్ చరణ్ సినిమాలు ఆల్ రెడి అక్కడ డబ్ అయ్యాయి కాబట్టి ఈ సినిమా వర్కౌట్ అయితే ఎన్టీఆర్ నటించిన ఇతర సినిమాలు కూడా ఈ గ్యాప్ లో ఒక్కొటిగా అక్కడ డబ్ చేసి రిలీజ్ చేయాలనే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తుంది.