Home న్యూస్ “రాజావారు రాణివారు” రివ్యూ…..హిట్టా – ఫట్టా!!

“రాజావారు రాణివారు” రివ్యూ…..హిట్టా – ఫట్టా!!

1

      కొన్ని సినిమాలు పేరుకు చిన్న సినిమాలే అయినా టీసర్ ట్రైలర్ లు రిలీజ్ అయిన తర్వాత మంచి అంచనాలు పెరుగుతాయి. అలాంటి కోవలోకే వచ్చే లేటెస్ట్ మూవీ “రాజావారు రాణివారు”.. చిన్న సినిమానే అయినా కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా పై ప్రతీ ఒక్కరికీ మంచి ఇంప్రెషన్ ఏర్పడటం ఖాయం. ఇక ఆ ఇంప్రెషన్ ను నేడు రిలీజ్ అయిన సినిమా నిలబెట్టుకుందా లేదా అన్నది తెలుసు కుందాం పదండీ..

కథ పాయింట్ కి వస్తే టీనేజ్ లో రాణి అనే అమ్మాయిని చూసి ఇష్టపడిన రాజా ఇంటర్ తర్వాత తను ఊరి విడిచి వేరే ఊరు వెళ్లి చడుకోవడంతో తన లవ్ ని చెప్పలేక పోతాడు. కాగా మూడేళ్ళ తర్వాత రాణి తిరిగి ఊరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, రాజా తన ప్రేమ గురించి రాణికి చెప్పాడా లేదా..అన్నది ఓవరాల్ గా సినిమా కథ.

పవన్ కళ్యాణ్ తొలిప్రేమ కథ ని కొంచం మార్చి పల్లెటూరి నేపధ్యంలో చెప్పినట్లు ఉంటుంది “రాజావారు రాణివారు” సినిమా.. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమా నటించిన వారందరూ కూడా తమ తమ రోల్స్ జీవించి నటించారు. హీరో హీరోయిన్స్ కూడా బాగా ఆకట్టుకున్నారు.

సంగీతం సినిమా థీం కి తగ్గట్లు పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మంచి ఫీల్ ని కలిగిస్తుంది. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు ఎంటర్ టైన్ మెంట్ అండ్ నాచురల్ లోకేషన్స్ తో సాగే కథ చాలా బాగా ఆకట్టుకోగా సెకెండ్ ఆఫ్ కి వచ్చే సరికి స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ వీక్ అయ్యింది.

దానికి కారణం కథ ఎమోషనల్ టచ్ తీసుకోవడం, ఎంటర్ టైన్ మెంట్ టోటల్ గా లేక పోవడం తో సెకెండ్ ఆఫ్ జస్ట్ పెర్ఫార్మెన్స్ తోనే సాగుతుంది, అది చాలా వరకు స్లో గా అనిపించడంతో ఫస్టాఫ్ ఇచ్చిన కిక్ ని సెకెండ్ ఆఫ్ ఇవ్వలేదు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది.

పల్లెటూరి అందాలు, ప్రకృతి ఒక్కసారి పాత రోజులను గుర్తు చేస్తూ మెప్పిస్తుంది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ముందుగా చెప్పుకున్నట్లు ఫస్టాఫ్ వరకు చాలా ఫ్రెష్ ఫీల్ తో ఆకట్టుకునే సీన్స్ తో ఎంటర్ టైన్ మెంట్ వే లో సాగిన కథ సెకెండ్ ఆఫ్ ఎమోషనల్ టర్న్ తీసుకోవడం అస్సలు ఎంటర్ టైన్ మెంట్ లేకపోవడం తో.. డ్రాగ్ అయింది.

దాంతో ఫస్టాఫ్ తో పోల్చితే సెకెండ్ ఆఫ్ లో ఫీల్ గుడ్ సీన్స్ ఉన్నా అవి ఫస్టాఫ్ సీన్స్ రేంజ్ లో ఎక్కవు. ఓవరాల్ గా సినిమా కథ చిన్నదే అయినా లోకేషన్స్, అండ్ ఫ్రెష్ ఫేసెస్ వలన కొత్త ఫీల్ తో చాలా వరకు ఆకట్టుకోగా సెకెండ్ ఆఫ్ డ్రాగింగ్ సీన్స్ ని కొంచం బరిస్తే…

ఒక మంచి పల్లెటూరి నేపధ్యంతో తెరకెక్కిన ఈ సినిమాని ఎంజాయ్ చేయోచ్చు. రెగ్యులర్ మూవీ గోర్స్ కూడా ఈజీగా ఒకసారి చూసే విధంగా సినిమా ఉంది. సెకెండ్ ఆఫ్ ని బెటర్ గా డీల్ చేసి ఉంటె మరింత బాగుండేది. మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ [2.75 స్టార్స్]..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here