బాక్స్ ఆఫీస్ దగ్గర సైరా రిలీజ్ తర్వాత దాదాపు 2 నెలల నుండి సరైన సినిమాలు లేక థియేటర్స్ వెల వెల బోతున్న సమయం లో విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వెంకీ మామ సందడి చేయడానికి సిద్ధం అయింది, కాగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 33.1 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా సుమారు 1000 వరకు…
థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బుకింగ్స్ ని గమనిస్తే… 5 రోజుల ముందు నుండే బుకింగ్స్ మొదలు అవ్వగా లాస్ట్ 2 రోజుల నుండి అన్ని సెంటర్స్ లో బుకింగ్స్ మెల్లి మెల్లి గా జోరు అందుకుంది అని చెప్పాలి.
అయినా కానీ భారీ గ్యాప్ తర్వాత రిలీజ్ కానున్న ఓ పెద్ద సినిమా కి ఉండాల్సిన బుకింగ్స్ అయితే ప్రస్తుతానికి లేవు, దానికి కారణం డిసెంబర్ కూడా అన్ సీజన్ గా పరిగణిస్తారు కాబట్టి ఆ ఎఫెక్ట్ పడి ఉండొచ్చు. ఇక ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్ మొత్తం మీద 35% లోపు జరిగాయి.
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా 5 – 10% లోపు ఉండగా ఈ ఓపెనింగ్స్ ని బట్టి సినిమా ఫస్ట్ డే 4 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు, ఇక మార్నింగ్ షో సమయానికి బుకింగ్స్ పుంజుకుని 50% టు 55% వరకు వెళ్ళే చాన్స్ ఉంది, అలా జరిగితే ఫస్ట్ డే 5 కోట్ల రేంజ్ నుండి 5.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవచ్చు.
ఇక టాక్ ని బట్టి రోజు మొత్తం స్టేటస్… 70% ని కూడా టచ్ చేసే చాన్స్ ఉంది, అలా జరిగితే 6.5 కోట్ల రేంజ్ షేర్ ని మొదటి రోజు అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి కలెక్షన్స్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది, మరి సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుంది, ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది.