బాక్స్ ఆఫీస్ దగ్గర రామ్ గోపాల్ వర్మ నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం తొలి రోజు ఎవ్వరూ ఊహకి కూడా అందని విధంగా ఊచకోత కోసే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. సినిమా అనుకున్న అంచనాలను కూడా మించి పోయి కలెక్షన్స్ ని సాధించింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఓపెనింగ్స్ చూసి తొలిరోజు సినిమా అవలీలగా 70 నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంటుంది అని అంచనా వేసినా ఆ అంచనాలను మించిపోయి మొదటి రోజు ఏకంగా సినిమా 1.39 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకుంది.
సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలు ఒకసారి ఏరియాల వారిగా గమనిస్తే
?Nizam: 39L
?Ceeded: 16L
?UA: 19L
?East: 15L
?West: 11L
?Guntur: 15L
?Krishna: 17L
?Nellore: 7L
AP-TG Total:- 1.39cr
Ka & ROI: 3L
OS: 2L
Total WW: 1.44CR(2.60cr Gross)
ఇదీ మొదటి రోజు సినిమా సాధించిన కలెక్షన్స్ ఊచకోత…
సినిమా టాక్ ని కూడా పట్టించుకోకుండా ఆడియన్స్ థియేటర్స్ కి విరగబడి వెళ్ళారు, దాంతో చాలా చిన్న మీడియం రేంజ్ మూవీస్ తో పోల్చుకుంటే భారీ వసూళ్ళ ని మొదటి రోజు అందుకుంది “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” సినిమా. ఇక సినిమా బిజినెస్ చాలా ఏరియాల్లో ఓన్ రిలీజ్ కాగా…
ఆ ఓన్ రిలీజ్ పక్కకు పెట్టి మిగిలిన బిజినెస్ 2.2 కోట్లు అయిందట. దాంతో బ్రేక్ ఈవెన్ కి సినిమా 2.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, ఆ లెక్కన సినిమా మరో 1.06 కోట్ల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఈ జోరు చూస్తుంటే వీకెండ్ లోపే సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.