Home గాసిప్స్ RGV D కంపెనీ మూవీ డైరెక్ట్ రిలీజ్…ఈ రేంజ్ రేటు ఏంటి సామి!

RGV D కంపెనీ మూవీ డైరెక్ట్ రిలీజ్…ఈ రేంజ్ రేటు ఏంటి సామి!

0

రామ్ గోపాల్ వర్మ లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ టైం లో చిన్నా చితకా మూవీస్ ని తీసి వాటిని పే పెర్ వ్యూ పద్దతిలో ఓన్ వెబ్ సైట్స్ లో రిలీజ్ చేసి బాగానే లాభాలను సొంతం చేసుకున్నాడు, పవర్ స్టార్ పేరుతో వచ్చిన మూవీ తో ఫుల్ లాభాలను కూడా సొంతం చేసుకున్నాడు. తర్వాత పరిస్థితులు చక్కదిద్దుకున్నాక వీలు కుదిరినప్పుడల్లా కొన్ని సినిమాలను థియేటర్స్ లో వదిలాడు కానీ…

పెద్దగా అయితే వర్కౌట్ కాలేదు. ఇంతలో మళ్ళీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఓ రేంజ్ లో ఉన్న నేపధ్యంలో మళ్ళీ డైరెక్ట్ రిలీజ్ ల పై దృష్టి పెట్టిన వర్మ… ఎప్పుడో తను తెరకెక్కించిన D కంపెనీ మూవీ ని ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయబోతున్నాడు.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లైఫ్ స్టొరీ తో ఈ సినిమా తెరకెక్కించాను అంటూ రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే అనేక సినిమాలు తీయగా మళ్ళీ అదే కథతో తీసిన సినిమా ఇది.. గల్లీ గూండాల నుండి ఇంటర్నేషనల్ క్రైం సిండికేట్ గా ఎలా దావూద్ ఇబ్రహీం ఎదిగాడు అన్నది…

ఈ సినిమాలో మరింత క్లియర్ గా చూపెట్టాను అంటూ చెప్పుకొచ్చిన రామ్ గోపాల్ వర్మ ముందు ఈ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ అనుకున్నా సెకెండ్ వేవ్ వలన అది కుదరకపోవడం తో ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ చేస్తున్నాడు, ఈ నెల 15 న స్పార్క్ OTT స్ట్రీమింగ్ యాప్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలియజేశాడు. ఇప్పటికీ వర్మ ని నమ్మి భారీ రేట్లు పెట్టేవాళ్ళు ఉన్నారనే చెప్పాలి.

ఈ సినిమా కోసం ఏకంగా 1.3 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారని అంటున్నారు ట్రేడ్ లో…. ముందు పే పెర్ వ్యూ పద్దతిలో కొన్ని రోజులు తర్వాత డిజిటల్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి వాటి రేట్లు ఎలా ఉంటాయో చూడాలి. మొత్తం మీద వర్మ తీసే సినిమాలకు ఇంకా భారీ మొత్తాలు వస్తూ ఉండటం విశేషమే. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి ఇక.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here