విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వెంకీ మామ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకు పోతుంది, కాగా సినిమా అన్ సీజన్ గా భావించే డిసెంబర్ లో కూడా అల్టిమేట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపు తుండటం విశేషం అనే చెప్పాలి. మొత్తం మీద టాలీవుడ్ లో మళ్ళీ సినిమాల సందడి మొదలు అయిందని చెప్పొచ్చు.
దసరా బరిలో నిలిచిన సైరా నరసింహా రెడ్డి వచ్చి వెళ్లి 2 నెలల కి పైగానే అవుతుంది, ఆ సినిమా తర్వాత రెండు నెలలు టాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. అడపాదడపా మీడియమ్ రేంజ్ మూవీస్ పర్వాలేదు అనిపించే ఓపెనింగ్స్ ని అందుకున్నా…
సాలిడ్ ఓపెనింగ్స్ తో జనాలను థియేటర్స్ కి భారీ సంఖ్య లో తీసుకు వచ్చిన సినిమా రాలేదనే చెప్పాలి. సైరా తర్వాత తెలుగు సినిమాల్లో మొదటి రోజు 2 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని కూడా అందుకోలేదు ఇప్పటి వరకు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు వెంకీమామ సందడి మొదలు అయింది. డిసెంబర్ ని అన్ సీజన్ గా భావిస్తారు కానీ… వెంకీ మామ మాత్రం…
బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు దుమ్ము లేపే కలెక్షన్స్ ని అందుకునే దిశగా దూసుకు పోతుంది, తొలిరోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మినిమమ్ 6 నుండి 7 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు… దాంతో సైరా సినిమా తర్వాత బెస్ట్ ఓపెనింగ్స్ మళ్ళీ టాలీవుడ్ ఇప్పుడు చూస్తుంది అని చెప్పాలి.
ఇక వచ్చే వారం మరో 2 పెద్ద సినిమాలు రిలీజ్ కానుండగా వాటి తర్వాత ఒక వారం తీసుకుని సంక్రాంతి సందడి మొదలు కానుంది. సంక్రాంతి నుండి నాన్ స్టాప్ గా ఫిబ్రవరి ఎండ్ వరకు వరుస పెట్టి పెద్ద మరియు మీడియం రేంజ్ మూవీస్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కళకళ లాడటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాల్లో ఎక్కువ శాతం హిట్స్ అవ్వాలని కోరుకుందాం.