Home TRP రేటింగ్ తమిళ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన సైరా…ఆల్ టైం రికార్డ్ TRP రేటింగ్!!

తమిళ్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసిన సైరా…ఆల్ టైం రికార్డ్ TRP రేటింగ్!!

336
0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సెన్సేషనల్ హై బడ్జెట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా బరిలో నిలిచిన విషయం తెలిసిందే, భారీ అంచనాల నడుమ వచ్చి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల టార్గెట్ ని అందుకోవడం లో విఫలం అయ్యి హిట్ టాక్ తో కూడా ఓవరాల్ గా ఫ్లాఫ్ గా పరుగును ముగించింది.

Sye Raa 19 Days Total Worldwide Collections Report!!

కానీ తెలుగు రాష్ట్రాల వరకు అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకుంది ఈ సినిమా. ఇక సినిమా వెండితెర పరుగు ముగిసిన తర్వాత బుల్లి తెరపై సందడి చేస్తుంది అనుకున్నా జెమినీ టీవీ సినిమా టెలికాస్ట్ ని సంక్రాంతి కి పోస్ట్ పోన్ చేసినట్లు టాక్. కానీ తమిళ్ లో సినిమా ను టెలికాస్ట్ చేశారు.

Sye Raa 16 Days Total Worldwide Collections Report!!

రీసెంట్ గా అక్కడ టెలికాస్ట్ చేయగా సినిమా కి అక్కడ ఆల్ టైం రికార్డ్ లెవల్ TRP రేటింగ్ దక్కింది. అది ఏ రేంజ్ అంటే… తమిళ్ లో డబ్ అయిన తెలుగు సినిమాల పరంగా ఆల్ టైం హైయెస్ట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది సైరా నరసింహా రెడ్డి సినిమా..

Sye Raa 18 Days Total Worldwide Collections Report!!

సినిమా అక్కడ ఏకంగా 15.44 TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది. ఒకసారి అక్కడ టాప్ TRP రేటింగ్ ని అందుకున్న తమిళ్ డబ్ తెలుగు మూవీస్ ని గమనిస్తే
1. #SyeRaaNarasimhaReddy – 15.44 TRP
2. #1Nenokkadine – 13.06 TRP
3. #SPYder – 10.4 TRP
4. #Baahubali2 – 10.33 TRP
5. #Baahubali – 8.66 TRP
6. #BharatAneNenu-3.54 TRP
7. #VinayaVidheyaRama – 2.64 TRP
ఇవీ అక్కడ టాప్ TRP రేటింగ్ లను అందుకున్న సినిమాలు.

Sye Raa 17 Days Total Worldwide Collections Report!!

ఇప్పుడు సైరా సినిమా అక్కడ ఆల్ టైం TRP రేటింగ్ రికార్డ్ ను బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. మెగాస్టార్ క్రేజ్ కి తోడూ అక్కడ లోకల్ స్టార్స్ విజయ్ సేతుపతి మరియు నయనతార కూడా ఉండటం TRP రేటింగ్ విషయం లో రికార్డులు నెలకొల్పడానికి ఉపయోగ పడింది. ఇక తెలుగు లో సినిమా కి ఎలాంటి TRP రేటింగ్ దక్కుతుందో చూడాలి.

Sye Raa Narasimha Reddy Total Business Recovery after 3rd Weekend

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here