నట సింహం నందమూరి బాలకృష్ణ కి 2019 పెద్దగా కలిసి రాలేదు, ఎంతో ఆశపడి చేసిన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. ఇలాంటి టైం ఈ ఇయర్ లోనే హిట్ కొట్టాలి అన్న కసి తో జై సింహా లాంటి హిట్ ఇచ్చిన కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో…
రూలర్ అంటూ సరికొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు బాలయ్య. కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ డీసెంట్ గానే ఉంది, వరుసగా బయోపిక్ సిరీస్ లోని 2 పార్టులు కూడా ఫ్లాఫ్ అయినా కానీ ఈ సినిమా డీసెంట్ బిజినెస్ ని అందుకోవడం విశేషం.
టోటల్ గా సినిమా సాధించిన ఓవరాల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ని ఒకసారి గమనిస్తే
?Nizam: 5.3Cr
?Ceeded: 5.2Cr
?UA: 2.5Cr
?East: 1.55Cr
?West: 1.4Cr
?Guntur: 2.7Cr
?Krishna: 1.5Cr
?Nellore: 1.1Cr
AP-TG Total:- 21.25CR??
Ka & ROI: 2.20Cr
OS: 0.30Cr
Total: 23.75CR
ఇదీ మొత్తం మీద సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్, ఓవర్సీస్ లో సినిమా ను ఎవ్వరూ కొనక పోవడంతో ఓన్ గా రిలీజ్ చేస్తున్నారు, కానీ ప్రింట్స్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు 30 లక్షల దాకా అవుతున్న నేపధ్యంలో ఇప్పుడు అదే సినిమా బిజినెస్ గా మారింది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమం 24.5 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ బరిలో అందుకోవాల్సి ఉంటుంది. మరి బాలయ్య తన స్టామినా ని ఈ సినిమా తో మరో సారి చూపెట్టి హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.