బాక్స్ ఆఫీస్ దగ్గర వెంకి మామ వీకెండ్ కుమ్మినా తర్వాత 4 మరియు 5 రోజుల్లో కొద్దిగా అంచనాలను తప్పింది, తిరిగి 6 వ రోజు 70 లక్షల రేంజ్ షేర్ అనుకున్నా కోటి దాకా షేర్ ని అందుకుని స్టడీ గా ఉంది, ఇక సినిమా 7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారగా..
సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 7 వ రోజున పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది, సినిమా 6 వ రోజు తో పోల్చుకుంటే 30% టు 40% వరకు డ్రాప్స్ కనిపిస్తున్నా మెల్లి మెల్లిగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ మొదలు అవుతున్నాయి.
దాంతో ఈ రోజు కూడా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కాగా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చేస్తుంటే 60 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా 7 వ రోజున అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.
కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ ని చూపిస్తే 70 లక్షల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. దాంతో రోజు ని సినిమా మరో సారి డీసెంట్ కలెక్షన్స్ తో ముగించే అవకాశామే ఎక్కువగా ఉందని చెప్పాలి.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వారం లో కొత్త సినిమాల నుండి భారీ పోటి ని ఎదురు కొబోతుంది కాబట్టి ఎంతవరకు సినిమా హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక రోజు ముగిసే సరికి వెంకి మామ స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.