నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర నేడు భారీ ఎత్తున రిలీజ్ అయింది, సినిమా ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకోగా అక్కడ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా ఒక ఊరిని కాపాడే పోలిస్ గా అలాగే సాఫ్ట్ వేర్ గా మరో పాత్ర లో బాలయ్య బాగా నటించాడానికి కథ చెబితే ఉన్న త్రిల్ పోతుందని అంటున్నారు. కానీ ఇది గతం కోల్పోయి తిరిగి గతం గుర్తు చేసుకునే నేపధ్యంలో ఉండే సినిమా అని అంటున్నారు.
బాలయ్య డాన్సులు, యాక్టింగ్, అండ్ యాక్షన్ సీన్స్ లో దుమ్ము లేపగా టోని స్టార్క్ లుక్ ఎక్స్ లెంట్ గా ఉందని, కానీ మిగిలిన లుక్స్ మాత్రం ఏమాత్రం సెట్ కాలేదని అంటున్నారు. ఇక హీరోయిన్స్ ఉన్నంతలో గ్లామర్ పరంగా యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నారని అంటున్నారు.
సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉన్నాయని అంటున్నారు, ఫస్టాఫ్ వరకు పడుతూ లేస్తూ సినిమా స్క్రీన్ ప్లే ఉంటుందని, మంచి పాయింట్ తో ఇంటర్వెల్ ఉండగా సెకెండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ పర్వాలేదు అనిపిస్తుందని అంటున్నారు.
ఓవరాల్ గా సినిమా మరీ అద్బుతం అనలేం కానీ యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో అనిపించిందని అంటున్నారు చూసినవాళ్ళు. సినిమా చూస్తున్నంత సేపు ఇది వరకు చూసిన ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ మళ్ళీ గుర్తుకు రావడం సినిమా మైనస్ పాయింట్ అని అంటున్నారు.
అది పక్కకు పెడితే బాలయ్య ఉన్నంతలో తనవరకు ఆడియన్స్ కి ఏం కావాలో అన్నీ చేసి మెప్పించాడని బాలయ్య కోసం ఒకసారి చూడొచ్చని అంటున్నారు. ప్రీమియర్ షోల నుండి సినిమా కి ఫైనల్ గా యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ టాక్ వచ్చింది, రొటీన్ సినిమాలకు అక్కడ ఇలాంటి టాక్ రావడం కామనే… ఇక రెగ్యులర్ షోలకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.