రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఖైదీ సినిమా తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ దొంగ, బాక్స్ ఆఫీస్ దగ్గర 4 సినిమాల నడుమ పోటి లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆ పోటి వలన ఏమాత్రం ఇంపాక్ట్ చూపడం లేదు.
సినిమా తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 23 లక్షల షేర్ ని మాత్రమె వసూల్ చేయగా రెండో రోజు కూడా పెద్దగా గ్రోత్ లేదు, కేవలం 20 లక్షల షేర్ ని మాత్రమె సొంతం చేసుకుంది ఈ సినిమా, ఇక మూడో రోజు కొద్దిగా గ్రోత్ ని సాధించింది ఈ సినిమా.
మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 24 లక్షల నుండి 26 లక్షల మధ్యలో షేర్ ని వసూల్ చేసినట్లు చెబుతున్నారు. దాంతో మొత్తం మీద సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 3 రోజులకు గాను 67 లక్షల నుండి 69 లక్షల దాకా షేర్ ని అందుకుంది.
కానీ సినిమా బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 3.5 కోట్ల రేంజ్ లో జరిగింది, దాంతో బ్రేక్ ఈవెన్ కి సినిమా 4 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది, కానీ మూడు రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ బిజినెస్ ని అందుకునే రేంజ్ లో అయితే లేవు.
మూడు రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని పక్కకు పెడితే సినిమా మరో 3.7 కోట్లకు పైగా షేర్ ని అందుకుంటే నే బ్రేక్ ఈవెన్ అవుతుంది, అది ప్రస్తుతానికి అసాధ్యంగానే కనిపిస్తుంది, పోటి లో కాకుండా సోలో గా రిలీజ్ అయ్యి ఉంటె పరిస్థితి బెటర్ గా ఉండేది అని చెప్పొచ్చు.