బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ కలెక్షన్స్ కోసం తెగ కష్టపడుతుంది, సినిమా మొదటి రోజు ఎలాగోలా మంచి వసూళ్ళనే సాధించినా తర్వాత మాత్రం ఎ దశ లో కూడా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని అందుకోలేక పోతుంది.
ఈ క్రమంలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 4 వ రోజున ఎంటర్ అవ్వగా 4 వ రోజు వర్కింగ్ డే అవ్వడం తో సినిమా మరింత క్షీణించింది. సినిమా 3 వ రోజు తో పోల్చితే 4 వ రోజు తొలి 2 షోల డ్రాప్స్ సాలిడ్ ఉన్నాయని తెలుస్తుంది, ఎంతలా అంటే…
3 వ రోజు తో పోల్చితే 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల డ్రాప్స్ మొత్తం మీద 50% టు 60% వరకు ఉన్నాయని తెలుస్తుంది, ఇది భారీ షాక్ అనే చెప్పాలి. సినిమా ఇక పుంజుకోక పొతే బాలయ్య ఖాతాలో మరో భారీ ఫ్లాఫ్ గా ఈ సినిమా నిలవడం ఖాయం.
కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ ఈ సినిమా పోటి లో ఉండటం వలనే ఇలాంటి ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పొచ్చు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల లో సినిమా కనుక గ్రోత్ ని చూపెట్టకుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.
ఒకవేళ గ్రోత్ చూపెట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటె సినిమా 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 50 లక్షల నుండి 60 లక్షల దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంటుంది, మరి రోజు ముగిసే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర రూలర్ స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.