Home న్యూస్ ప్రతీరోజూ పండగే డే 4 స్టేటస్…..తగ్గేది లేదు కుమ్ముడే!!

ప్రతీరోజూ పండగే డే 4 స్టేటస్…..తగ్గేది లేదు కుమ్ముడే!!

0

     6 వరుస ఫ్లాఫ్స్ తర్వాత ఈ ఇయర్ చిత్రలహరి తో హిట్ కొట్టిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన సరికొత్త సినిమా ప్రతీరోజూ పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని సెన్సేషనల్ కలెక్షన్స్ తో ముగించింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో..

11.40 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపగా ఇప్పుడు 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకున్న సినిమా స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తూ దూసుకు పోతుండటం విశేషం, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 వ రోజు మొత్తం మీద చూసుకుంటే…

3 వ రోజు తో కంపేర్ చేస్తే 40% లోపు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, వర్కింగ్ డేస్ లో ఇది కామన్ అనే చెప్పాలి, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ మెల్లి మెల్లి గా పుంజుకుంటున్నాయి కాబట్టి సినిమా మరోసారి సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోవచ్చు.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే సినిమా 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్, ఆక్యుపెన్సీ అండ్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్నీ అనుకున్నట్లు ఉంటె సినిమా 2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు.

ఇది మొత్తం మీద సాలిడ్ కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇలాగే సినిమా మిగిలిన వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే మొదటి వారం పూర్తీ అయ్యే సరికి సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇక 4వ రోజు పూర్తీ అయ్యే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here