నట సింహం నందమూరి బాలకృష్ణ కి ఈ ఇయర్ ఏమాత్రం కలిసి రాలేదు, ఇయర్ మొదట్లో 2 అట్టర్ డిసాస్టర్ మూవీస్ తర్వాత ఇప్పుడు కమర్షియల్ మూవీ తో అయినా ఆడియన్స్ ని అలరిద్దాం అనుకుంటే, తన కష్టం తో మెప్పించినా కలెక్షన్స్ మాత్రం రావడం లేదు.
బాలయ్య డాన్సులు స్టైల్ కి మంచి రెస్పాన్స్ వస్తున్నా కానీ ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళడం లేదు, దాంతో సినిమా 4 రోజులు పూర్తీ అయ్యే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల రేంజ్ లోనే షేర్ ని సాధించి బిజినెస్ ని అందుకోవడానికి చాలా దూరంలో ఉంది.
ఇలాంటి టైం లో సినిమా కి ఇప్పుడు క్రిస్టమస్ హాలిడేస్ కొద్దిగా ఊపిరి పోసే అవకాశాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ఆ అవకాశాన్ని సినిమా ఎంతవరకు వాడుకుంటుందో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు ఓపెనింగ్స్ పరంగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో…
తొలి 2 షోలకు వచ్చే సరికి 20% రేంజ్ లో డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, హాలిడే అడ్వాంటేజ్ ఈవినింగ్ అండ్ నైట్ షోల నుండి మొదలు అవుతుంది కాబట్టి సినిమా పుంజుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు 4 వ రోజు కన్నా బెటర్ కలెక్షన్స్ రావచ్చు.
లేక పొతే సినిమా 4 వ రోజు కన్నా మరింత తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఏది ఏమైనా ఈ రోజు రేపు సినిమా కి చాలా కీలకం అనే చెప్పాలి. మరి రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.