నట సింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ రూలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ కోసం కష్టాలు పడుతూనే ఉంది, సినిమా తేరుకోవడానికి హాలిడేస్ కూడా వచ్చినా కానీ ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోతుంది ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజులు పూర్తీ అయ్యే సరికి 8.4 కోట్ల రేంజ్ లో షేర్ తోనే సరిపెట్టుకున్న సినిమా ఇప్పుడు 6 వ రోజు క్రిస్టమస్ హాలిడే ఉన్నా కానీ ఇంపాక్ట్ చూపడం లేదు.
సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 6 వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు 5 వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 25% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, అంటే 5 వ రోజు వచ్చిందే 30 లక్షలు అంటే అందులో 25% వరకు డ్రాప్స్ అన్నమాట. ఇక తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో…
5% టు 8% వరకు గ్రోత్ కనిపించినా అది ఏమాత్రం ఇంపాక్ట్ చూపేలా అయితే లేదనే చెప్పాలి. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ సీడెడ్ లో బాగానే ఉండగా నైజాం లో జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉందని చెప్పాలి. దాంతో మొత్తం మీద సినిమా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తుంటే..
6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవచ్చు. మాస్ సెంటర్స్ లో లేట్ నైట్ షోలలో ఏదైనా అద్బుతాలు జరిగితే తప్పితే సినిమా ఈ మార్క్ కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా 6 వ రోజున 30 లక్షల నుండి 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ ఫేట్ ఏంటో అనేది ఆల్ మోస్ట్ డిసైడ్ అయినట్లే అని చెప్పొచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రూలర్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేయలేక పోతుంది.