కోలివుడ్ స్టార్ కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దొంగ. బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ ఎండింగ్ లో చాలా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బిజినెస్ పరంగా మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 3.5 కోట్ల రేంజ్ రేటు ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది, దానికి ప్రధాన కారణం దీపావళి టైం లో ఇలాగే సైలెంట్ గా రిలీజ్ అల్టిమేట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన…
ఖైదీ సినిమా నే కారణం అని చెప్పాలి. ఆ సినిమా అద్వీతీయ విజయం వల్ల ఈ సినిమా ను కూడా సైలెంట్ గా రిలీజ్ చేశారు, దృశ్యం సినిమా డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమా కి డైరెక్టర్ అవ్వడం తో అంత రేటు పెట్టేశారు. రిలీజ్ అయిన తర్వాత పర్వాలేదు అనిపించే టాక్ ని…
సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆ ఇంపాక్ట్ ఏమాత్రం చూపలేక పోయింది ఈ సినిమా. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద డిసాస్టర్ గా పరుగును ముగించింది, పోటిలో ఫ్యామిలీ మూవీస్ రాజ్యం ఏలడం కూడా ఈ సినిమా కి భారీగా ఇంపాక్ట్ చూపింది.
సినిమా ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ సమ్మరీ ని గమనిస్తే
?Movie Business: 3.5Cr~
?Break Even: 4cr
?AP TG Total Share: 1.86Cr
?Total Gross: 3.13Cr
?Total Loss: 1.64Cr Loss From Business
?Movie Verdict: (D-I-S-A-S-T-E-R)
ఇదీ మొత్తం మీద సినిమా ఫైనల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలు.
సినిమా 4 కోట్ల టార్గెట్ లో కేవలం 1.86 కోట్ల షేర్ ని మాత్రమె రికవరీ చేయగా ఓవరాల్ గా బిజినెస్ నుండి 1.64 కోట్ల లాస్ ని దక్కించుకుని డిసాస్టర్ గా పరుగును ముగించింది, దాంతో 2019 ఇయర్ లో కార్తీ తెలుగు లో ఖైదీ బ్లాక్ బస్టర్ అలాగే దేవ్ అండ్ దొంగ సినిమాలతో 2 డిసాస్టర్లతో ఇయర్ ను ముగించాడు.