కెరీర్ స్టార్టింగ్ ని అల్టిమేట్ లెవల్ లో మొదలు పెట్టాడు కుర్ర హీరో రాజ్ తరుణ్, ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తా మావ మరియు కుమారి 21F, మల్టీ స్టారర్ ఈడోరకం ఆడో రకం ఇలా దూసుకు పోతున్న తరుణం లో ఒకటి తర్వాత ఒకటి ఫ్లాఫ్స్ వస్తు ఏకంగా కెరీర్ లో పూర్తిగా డౌన్ ఫాల్ లో పడిపోయాడు రాజ్ తరుణ్. చేసిన సినిమా చేసినట్లు ఫ్లాఫ్ అవుతూ వస్తుండగా
తన మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఇలాంటి టైం లో క్రేజీ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో లవర్స్ అంటూ ఓ ఫ్లాఫ్ ఇచ్చినా మరోసారి ఇద్దరి లోకం ఒకటే అంటూ మరో అవకాశం దక్కగా ఈ సినిమా క్రిస్టమస్ హాలిడే రోజున రిలీజ్ అయినా కానీ ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేదు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ కలెక్షన్స్ సమ్మరీ ని గమనిస్తే
?Movie Business: 1.2Cr~
?Break Even: 1.50cr
?AP TG Total Share: 0.62Cr
?Total WW Share: 0.70cr
?Total Gross: 1.21Cr
?Total Loss: 0.50Cr Loss From Business
?Movie Verdict: (D-I-S-A-S-T-E-R)
ఇదీ సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ సమ్మరీ…
ఇది వరకు రాజ్ తరుణ్ మూవీస్ బిజినెస్ యావరేజ్ గా 4 నుండి 5 కోట్ల రేంజ్ లో జరిగేవి, కానీ సినిమా బిజినెస్ 1.2 కోట్ల రేంజ్ లోనే జరగగా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫైనల్ రన్ లో కేవలం 70 లక్షల షేర్ ని మాత్రమె వసూల్ చేసి షాక్ ఇచ్చింది.
దాంతో బిజినెస్ నుండి ఆల్ మోస్ట్ 50 లక్షల రేంజ్ లాస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద డిసాస్టర్ గా పరుగును పూర్తీ చేసింది. మంచి ఎనర్జీ ఉన్న రోల్స్ చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్న టైం లో సటిల్డ్ రోల్స్ తో ఇలా ఫ్లాఫ్స్ కొడుతున్నాడు రాజ్ తరుణ్. మంచి హిట్ తో త్వరలో కంబ్యాక్ చేయాలని కోరుకుందాం…