యూత్ స్టార్ నితిన్ హీరోగా రీసెంట్ టైం లో చేసిన సినిమాలు అన్నీ ఫ్లాఫ్ అయిన విషయం తెలిసిందే, అ ఆ తర్వాత నితిన్ చేసిన సినిమాలు అన్నీ ఆడియన్స్ ని నిరాశ పరిచి ఫ్లాఫ్స్ అవ్వగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తన కొత్త సినిమా భీష్మ తో రాబోతున్నాడు నితిన్. వరుస ఫ్లాఫ్స్ ఎదురు అయినా కానీ భీష్మ సినిమా కి అన్ సీజన్ గా భావించే ఫిబ్రవరి లో…
సూపర్ సాలిడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ దక్కడం విశేషం అనే చెప్పాలి. ఓవరాల్ గా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 17.85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని, వరల్డ్ వైడ్ గా 21.8 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ని దక్కించుకుని సత్తా చాటుకుంది.
ఒకసారి ఏరియాల వారి బిజినెస్ ని గమనిస్తే
?Nizam: 6.50Cr
?Ceeded: 3Cr
?UA: 1.80Cr
?East: 1.50Cr
?West: 1.20Cr
?Guntur: 1.75Cr
?Krishna: 1.40Cr
?Nellore: 0.70Cr
AP-TG Total:- 17.85CR
?Ka & ROI: 1.55Cr
?OS: 2.40Cr
Total WW: 21.80CR(few areas own release that worth around 1.20cr)
సినిమా కి ఓవరాల్ గా 1.2 కోట్ల దాకా ఓన్ రిలీజ్ ఉంది, అది పక్కకు పెడితే 21.8 కోట్ల బిజినెస్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 22.5 కోట్ల దాకా షేర్ ని బాక్స్ ఆఫీస్ బరిలో సాధిస్తే హిట్ గీత దాటుతుంది. సంక్రాంతి తర్వాత ఆడియన్స్ ని అలరించే సరైన సినిమా రాకపోవడం…
దానికి తోడూ వచ్చే వారం హిట్ సినిమా తప్పితే మరో 5 వారాల పాటు మరే సినిమా లేక పోవడం తో భీష్మ కి జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సాఫీగా లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. మరి నితిన్ ఎంతవరకు అంచనాలను అందుకుంటాడో చూడాలి.