Home గాసిప్స్ 200 కోట్ల సినిమా ఆగిపోయిందా…యూనిట్ క్లారిటీ!!!

200 కోట్ల సినిమా ఆగిపోయిందా…యూనిట్ క్లారిటీ!!!

0

     లోక నాయకుడు కమల్ హాసన్ మరియు శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే, డబ్బింగ్ మూవీస్ పరంగా 20 ఏళ్ల క్రితమే వన్ ఆల్ టైం రికార్డులు సాధించిన ఈ సినిమా కి సీక్వెల్ ని ఎట్టకేలకు రెండేళ్ళ క్రితం అనౌన్స్ చేసి లాస్ట్ ఇయర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు యూనిట్. 2.0 ఓవరాల్ గా అంచనాలను అందుకునే కలెక్షన్స్ ని అందుకొక పోవడం తో…

ఈ సినిమా బడ్జెట్ పై ఆ ఇంపాక్ట్ పడినా ఈ సినిమా కూడా 200 కోట్లకు తగ్గని బడ్జెట్ తో రూపొందుతుంది, కానీ సినిమా మొదలు అయినప్పటి నుండి ఎదో ఒక సమస్య తో ఇబ్బందులు ఎదురు అవుతూనే ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లో…

క్రేన్ కింద పడటం తో కొంతమంది చనిపోయారు కూడా… దాంతో ఫిబ్రవరి ఎండ్ నుండి షూటింగ్ ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు లాక్ డౌన్ కూడా చేరడం మరింత ఆలస్యం అవుతూ వస్తుండటం తో ఈ సినిమా కి ఎదురు అవుతున్న సమస్యల తో ఈ సినిమాను…

యూనిట్ ఆపేశారని వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. దాంతో వెంటనే స్పందించిన లైకా ప్రొడక్షన్ వాళ్ళు…ఇందులో ఎలాంటి నిజం లేదని, సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న క్రేజీ మూవీ ని మేమెందుకు ఆపేస్తామని చెబుతూ త్వరలోనే మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ ఈ సినిమా జరుపుకుంటుందని క్లారిటీ ఇచ్చారు.

200 కోట్ల మినిమం బడ్జెట్ అంటున్న ఈ సినిమా అసలు బడ్జెట్ మరింత ఎక్కువగానే ఉంటుందని టాక్ ఉంది, ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఇయర్ సంక్రాంతి కి లేక సమ్మర్ లో రిలీజ్ కావొచ్చని అంటున్నారు. మొదటి పార్ట్ సక్సెస్ దృశ్యా ఈ సినిమా అన్ని చోట్లా సంచలనాలు సృష్టించడం మాత్రం ఖాయమని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here