Home న్యూస్ ఎన్టీఆర్ గొప్ప మనసు…శెభాష్ అంటున్న టాలీవుడ్!

ఎన్టీఆర్ గొప్ప మనసు…శెభాష్ అంటున్న టాలీవుడ్!

0

కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన అందరూ తమ తమ పనులను కోల్పోయిన విషయం తెలిసిందే. చాలా మంది లాక్ డౌన్ చాలా రోజులుగా కొనసాగుతూ ఉండటం వలన దాచుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. ఇలాంటి సమయం లో ఓనర్స్ వీళ్ళకు ఆపన్న హస్తం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. టాలీవుడ్ విషయానికి వస్తే లాక్ డౌన్ వలన షూటింగ్ లు అన్నీ ఆగిపోవడం తో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు…

ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం తన దగ్గర పని చేస్తున్న వాళ్ళందరినీ ఆదుకోవాలని ఫిక్స్ అయ్యాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్…లాక్ డౌన్ కొనసాగుతున్న నేపధ్యం లో తన ఇంట్లో అలాగే తన ఆఫీస్ లో పని చేస్తున్న అందరికీ ఎన్టీఆర్ అడ్వాన్స్ జీతాలు ఇవ్వడం కూడా మొదలు పెట్టాడట.

ఇంట్లో పని చేస్తున్న వాళ్లకు అలాగే ఆఫీస్ లో తన తో పని చేసే వాళ్లకు కూడా అడ్వాన్స్ జీతాలు ఇవ్వడమే కాకుండా ఎప్పుడు ఎం అవసరం వచ్చినా కూడా తనని నిర్మొహమాటంగా అడగమని ఆపన్న హస్తం అందించాడట… దాంతో ఇప్పుడు ఈ న్యూస్ విని టాలీవుడ్ మొత్తం ఎన్టీఆర్ ని మెచ్చుకుంటున్నారు…

ఇలానే చాలా మంది సెలెబ్రిటీలు తమ వద్ద పని చేస్తున్న వారికి హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యారు, దాంతో వీళ్ళకి ఈ లాక్ డౌన్ వలన ఆర్ధిక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది, ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీ గా ఉన్న విషయం అందరికీ తెలిసినదే..

ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన అప్ కమింగ్ మూవీ ని చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాల్లో అప్ డేట్ త్వరలోనే ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ కాబోతున్నాయి అని లేటెస్ట్ న్యూస్. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుంది అన్నది త్వరలోనే తెలుస్తుందని చెప్పొచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here