కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే, ముఖ్యంగా గత మూడు సినిమాలు మెర్సల్, సర్కార్ మరియు బిగిల్ లు అల్టిమేట్ కలెక్షన్స్ తో ఊచకోత కోశాయి, లాస్ట్ ఇయర్ వచ్చిన బిగిల్ తెలుగు లో విజిల్ పేరు తో డబ్ అవ్వగా ఇక్కడ కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…
విజయ్ కెరీర్ లో నంబర్ 1 మూవీ గా నిలిచింది. ఇక ఈ సినిమా బడ్జెట్ 180 కోట్ల రేంజ్ లో ఉందని టాక్ వచ్చినప్పటికీ కోలివుడ్ వర్గాలు 160 కోట్ల రేంజ్ లో సినిమా నిర్మాణం అయ్యిందని అంటున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర 3 వారాల్లో 290 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.
టోటల్ రన్ లో 298 కోట్ల నుండి 300 కోట్ల లోపు గ్రాస్ ని 153 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. సినిమా బిజినెస్ మొత్తం మీద 134 కోట్లు కాగా ఆల్ మోస్ట్ 19 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది, అలాంటి సినిమా ను లేటెస్ట్ గా బాక్స్ ఆఫీస్ లెక్కలు తెలిసి తెలియని నార్త్…
న్యూస్ వెబ్ సైట్స్ నడిపే వాళ్ళలో ఒకరు 20 కోట్ల మేర సినిమా నష్టాలను సొంతం చేసుకుందని వార్తలు ప్రచారం చేశారు. దాంతో సోషల్ మీడియా లో ఇతర హీరోల ఫ్యాన్స్ ఈ వార్తలను భారీ ఎత్తున ట్రెండ్ చేయగా బిగిల్ సినిమా ను నిర్మించిన AGS కంపెనీ నుండి… అర్చన కల్పతి ట్విట్టర్ లో…
సినిమా కి నష్టం వచ్చిందని మేం ఎక్కడా చెప్పలేదని, సినిమా తో మాకు మంచి ప్రాఫిట్స్ దక్కాయని ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వడం తో ఫ్యాన్స్ ఆ వెబ్ సైట్ పై మండి పడుతున్నారు. తెలుగు లో కలెక్షన్స్ కొంచం అటూ ఇటూ గా అయినా రిలీజ్ అవుతాయి కానీ తమిళ్ లో క్లారిటీ లేకుండా రిలీజ్ అవ్వడం వలనే ఇలా కొందరు తెలిసీ తెలియని జ్ఞానంతో ప్రవర్తిస్తారని విశ్లేషకులు అంటున్నారు.