Home గాసిప్స్ అస్సలు చేయం అంటూనే…సినిమా అమ్మేశారుగా!!

అస్సలు చేయం అంటూనే…సినిమా అమ్మేశారుగా!!

0

ఇండియా వైడ్ గా పరిస్థితులు ఏమాత్రం చక్కదిద్దుకోలేదు సరికదా మరింతగా క్షీణించసాగాయి, ఇలాంటి టైం లో థియేటర్స్ రీ ఓపెన్ అన్నది మరింత సమయం తీసుకునే అవకాశం ఎంతైనా ఉంది, అదే సమయం లో థియేటర్స్ తిరిగి తెరిచినా కానీ జనాలు మునుపటి లా వచ్చే అవకాశం అయితే లేదనే చెప్పాలి. దాంతో చాలా మంది ఉన్నంతలో ఇప్పుడు డిజిటల్ రిలీజ్ లే బెటర్ అన్న భావన కి వస్తున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే కొన్ని సినిమాలు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకోగా అన్నింటి కన్నా ఎక్కువ రేటు ఉన్నంతలో ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబో సినిమా కి 63 కోట్ల రేటు దక్కింది. కానీ ఇప్పుడు ఆ రేటు కి డబుల్ రేటు చెల్లించి ఓ బిగ్ మూవీ రాబోతుంది.

అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమా ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది, సినిమా నిర్మాతలు సినిమా డిజిటల్ రైట్స్ ని ఇది వరకే 120 కోట్లకు డిస్నీ ప్లస్ కి అమ్మేశారు కానీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయబోమని సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు యూనిట్ వాళ్ళు.

కానీ వాళ్ళే ఇప్పుడు పరిస్థితులు అర్ధం చేసుకుని సినిమా ను ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ గా రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం. బాలీవుడ్ లో ఈ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి కూడా. సినిమా త్వరలోనే డిజిటల్ రిలీజ్ డేట్ ని కన్ఫాం చేస్తారని కూడా చెబుతున్నారు. అసలు రిలీజ్ చేయమని చెబుతూనే పరిస్థితుల ప్రభావం వల్ల…

ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ వల్లే నిర్మాతలు సేఫ్ గా ఉంటారని భావిస్తున్నారు వారు. ఈ సినిమా కనుక డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకుంటే కచ్చితంగా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల్లో ఎక్కువ శాతం డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధ పడటం ఖాయమని అంటున్నారు. అదే జరిగేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here