ఒకప్పుడు గోపీచంద్ సినిమా లు అంటే మాస్ ఆడియన్స్ లో భారీ ఆసక్తి ఉండేది, మినిమమ్ గ్యారెంటీ మూవీ కన్ఫాం గా ఇస్తాడు అన్న నమ్మకం తో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా లాంగ్ రన్ లో కూడా కుమ్మేశాయి. కానీ అందరికీ సమయం కలిసి రాదు, రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ కి సరైన హిట్ లేదనే చెప్పాలి.
దాంతో తన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గరే కాకుండా టెలివిజన్ లో కూడా నిరాశపరుస్తున్నాయి. ఇక కొన్ని కారణాల వల్ల మూడేళ్ళ క్రితమే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఓ మాస్ మూవీ కూడా ఆగిపోయింది. టాలీవుడ్ కి సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు మరియు ఇంద్ర లాంటి…
ఇండస్ట్రీ హిట్ మూవీస్ ని అందించిన డైరెక్టర్ బి గోపాల్ డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా నయనతార హీరోయిన్ గా తెరకెక్కిన ఆరడుగుల బులెట్ సినిమా పవర్ ఫుల్ టైటిల్ తో వచ్చినప్పటికీ రిలీజ్ అయినట్లే అయ్యి అనుకోని కారణాల వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది. తర్వాత ఇప్పటి వరకు ఆ సినిమా ఊసే లేదు.
దాదాపు మూడేళ్ళ తర్వాత మళ్ళీ ఈ సినిమా ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది, కాగా ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమా ను సుమారు 15 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం చేస్తున్న ఆఫర్లు మాత్రం 6 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ లోనే ఉన్నాయని తెలుస్తుంది.
బడ్జెట్ దృశ్యా ఇది చాలా తక్కువే అని చెప్పాలి, దీని పై నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉండగా డిజిటల్ రిలీజ్ జరిగితే శాటిలైట్ రైట్స్ అండ్ హిందీ డబ్బింగ్ రైట్స్ తో నిర్మాత మొత్తం మీద పెట్టిన బడ్జెట్ రికవరీ చేసుకోవచ్చని అంటున్నారు. అందుకే డిజిటల్ రిలీజ్ ఆఫర్ తక్కువ అయినా ఆలోచిస్తున్నాడని అంటున్నారు. త్వరలోనే దీని పై మరింత క్లారిటీ వస్తుంది…..