Home గాసిప్స్ ఎన్టీఆర్ కి లుక్ టెస్ట్ చేసిన త్రివిక్రమ్…దేనికోసమంటే!!

ఎన్టీఆర్ కి లుక్ టెస్ట్ చేసిన త్రివిక్రమ్…దేనికోసమంటే!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత ఎన్టీఆర్ కెరీర్ నంబర్ 1 మూవీ గా నిలిచిన విషయం తెలిసిందే, కాగా వీరి కాంబినేషన్ లో ఇప్పుడు సరికొత్త సినిమా అతి త్వరలోనే మొదలు కాబోతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న కరోనా ఎఫెక్ట్ వలన అన్ని సినిమాల పనులు ఆగిపోగా… ఇప్పుడిప్పుడో ఒక్కో పనిని తిరిగి మొదలు పెడుతున్నారు.

కాగా ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ పనులలోనే ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమా కి గాను ఫైనల్ షూటింగ్ ఇంకా చేయాల్సి ఉండగా లాక్ డౌన్ లేకుండా ఉంటే ఈ పాటికే తన అప్ కమింగ్ మూవీ ని కూడా మొదలు పెట్టి ఉండే వాడు. కానీ లాక్ డౌన్ వలన…

అన్నీ ఆగిపోగా త్రివిక్రమ్ తో సినిమా ఎప్పుడు మొదలు అవుతుంది అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది, దసరా టైం కి మొదలు అవుతుంది అంటున్నారు కానీ అఫీషియల్ అప్ డేట్ లేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న న్యూస్ ప్రకారం…

రీసెంట్ గా షూటింగ్ లు తిరిగి మొదలు అయిన తర్వాత ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఒక చిన్న లుక్ టెస్ట్ చేశారట. అతి తక్కువ మందితో ఈ లుక్ టెస్ట్ జరిగింది అని టాక్ ఉంది. ఈ లుక్ టెస్ట్ కి కారణం సినిమా లో ఎన్టీఆర్ ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నారు అని ఇది వరకే టాక్ ఉండగా…

ఆ పొలిటికల్ లీడర్ లుక్ టెస్ట్ కద్దరు చొక్కాలో ఎన్టీఆర్ తో ప్లాన్ చేశారట. ఇది చాలా సీక్రెట్ గా జరిగిన టెస్ట్ అని అంటున్నారు. ఈ సినిమా లో కూడా ఎన్టీఆర్ లుక్ చాలా డిఫెరెంట్ గా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే దీని పై ఒక అప్ డేట్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక సినిమా వచ్చే ఇయర్ సమ్మర్ రిలీజ్ అనుకున్నా సెకెండ్ ఆఫ్ కి పోస్ట్ పోన్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here