Home న్యూస్ షాకింగ్ ప్రాఫిట్…30 కోట్ల బడ్జెట్ సినిమా…బిజినెస్ తెలిస్తే షాక్ అంతే!

షాకింగ్ ప్రాఫిట్…30 కోట్ల బడ్జెట్ సినిమా…బిజినెస్ తెలిస్తే షాక్ అంతే!

0

ఈ కరోనా ఎఫెక్ట్ వలన కొత్త సినిమాలు రిలీజ్ కి నోచుకుంటాయో లేదో అన్న డౌట్ అందరి లోనూ ఉండగా కొన్ని సినిమాలకు ఇప్పుడు దేవుడిచ్చిన వరం లో OTT ప్లాట్ ఫామ్స్ నిలుస్తున్నాయి. చిన్న పెద్ద సినిమా లు తేడా లేకుండా అన్ని సినిమాలకు గాలం వేస్తున్న డిజిటల్ యాప్స్ అన్నీ దొరికిన సినిమా ను దొరికినట్లు కొనేసి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం చేస్తుండటం విశేషం అనే చెప్పాలి.

ఇప్పటికే ఈ సంఖ్య మెల్లిగా 10 కి చేరువ అవుతుండగా ఇప్పుడిప్పుడే ఇతర సినిమా లు కూడా లిస్టు లో ఎంటర్ అవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. లేట్ శ్రీదేవి గారి కుమార్తె జాన్వి కపూర్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గుంజన్ సక్సేనా..

కార్గిల్ యుద్ధంలో యుద్ధ విమానాలు నడిపిన గుంజన్ సక్సనా సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు అయితే లేవు. సినిమా కూడా చాలా తక్కువ బడ్జెట్ లో 30 కోట్ల రేంజ్ లో తెరకెక్కగా సినిమా లేటెస్ట్ గా డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవ్వగా నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా ను కొనేసింది.

అది కూడా ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా 70 కోట్ల రేంజ్ రేటు చెల్లించి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని దక్కించుకోవడం ఇప్పుడు బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కరణ్ జోహార్ నిర్మాణం లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినా అంత బిజినెస్ సాధించే అవకాశం లేనే లేదని చెప్పాలి.

అంత బిజినెస్ సాధించినా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాలి అంటే ఏకంగా 130 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని అందుకోవాలి. కానీ ఇప్పుడు అలాంటి రిస్క్ ఏమి లేకుండా 30 కోట్ల బడ్జెట్ కి 70 కోట్ల రేంజ్ బిజినెస్ తో 40 కోట్ల వరకు ప్రాఫిట్ తో వచ్చే నెలలో రిలీజ్ కి సిద్ధం అయ్యింది ఈ సినిమా.. మరిన్ని సినిమాలు ఇప్పుడు ఇదే విధంగా రిలీజ్ ని సొంతం చేసుకోవడం పక్కా అని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here