ఈ కరోనా ఎఫెక్ట్ వలన సినిమా లు అన్నీ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్న క్లారిటీ లేకుండా పోయింది. దానికి తోడు సినిమా నే నమ్ముకున్న వాళ్ళు చాలా మంది కి పని లేకుండా పోయింది. ఇలాంటి టైం లో నిర్మాతల కు కాస్త అండ్ క్రూ కి అండగా నిలవాల్సిన భాద్యత అందరికీ ఉందని చెప్పాలి. దాంతో కోలివుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతలు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారని సమాచారం…
కోలివుడ్ హీరోలు, హీరోయిన్స్ అలాగే టాప్ టెక్నీషియన్స్ అందరూ కూడా తమ తమ రెమ్యునరేషన్ ని సగానికి తగ్గించుకుని తీరాలని, అప్పుడే వాళ్ళతో సినిమాలు కమిట్ అవ్వాలని షాకింగ్ డిసిషన్ తీసుకున్నారని సమాచారం. ఎంతో కొంత తగ్గించుకొమనడం ఒక పద్దతి, ఎవరికీ వారు ఇంత తగ్గించుకుంటున్నాం అని చెప్పడం ఒక పద్దతి….
కానీ కోలివుడ్ నిర్మాతలు ఏకంగా ఇంత తక్కువ చేసుకోవాల్సిందే అని చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ టౌన్ గా మారింది అని చెప్పాలి. ఇక ఈ షాకింగ్ నిర్ణయం చూసి టాలీవుడ్ వైపు అందరి చూపు వెళ్ళింది. ఈ మధ్యే ఇక్కడ కూడా రెమ్యునరేషన్ లు తగ్గించు కోవాలి అని…
స్టేట్ మెంట్స్ ఇచ్చారు కానీ ఇప్పటికి అయితే ఎవరు తగ్గించుకున్నారో లేదో కూడా తెలియదు. ఇప్పుడు కోలివుడ్ లో సగం రెమ్యునరేషన్ కట్ అంటున్నారు కాబట్టి టాలీవుడ్ లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నిర్మాతలు సేఫ్ గా ఉంటారని అంటున్నారు…. కానీ ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది మాత్రం ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి.
ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి మన దగ్గర ఇలా ముక్తకంటంగా అయితే తగ్గించుకోవాలి అని స్టేట్ మెంట్స్ ఇవ్వలేరు అని చెప్పొచ్చు. ఇక తగ్గించుకోవడం కోక పోవడం అన్నది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. మరి ముందుగా ఎవరు ముందుకు వస్తారు అని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు…