Home న్యూస్ పాన్ ఇండియా మోజు..తగ్గిన సినిమాలు…హీరోలు మారాల్సిందేనా!!

పాన్ ఇండియా మోజు..తగ్గిన సినిమాలు…హీరోలు మారాల్సిందేనా!!

0

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు నలుగురు, స్టార్ హీరోలు ఆరుగురు, మీడియం రేంజ్ హీరోలు పదిమందికి పైగా ఎంతో కొంత మార్కెట్ ఉన్న వాళ్ళు ఉన్నారు…. ఒకప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోలు ఏడాదికి మినిమమ్ 4-6 సినిమాలు చేసేవాళ్ళు, కథలు ఉండేవి వాళ్ళు చేశారు…ఒకటి దెబ్బ కొట్టినా మరోటి కవర్ చేసేది…

ఇప్పుడు సీన్ టోటల్ రివర్స్..పెరిగిన మార్కెట్ కి న్యాయం చేసే సినిమాలు చేయాలని కొందరు…ఆ పెరిగిన మార్కెట్ ని ఇంకా పెంచుకోవాలని కొందరు…ఏడాదికి ఒకటి కాదు కదా ఏడాదిన్నర రెండేళ్ళకి ఒక సినిమా చేస్తున్నారు ఇప్పుడు..బాహుబలి(Baahubali) RRR లాంటి సినిమాలు తెలుగు సినిమా మార్కెట్ ని చాలా బాగా పెంచాయి…

ఆ పెరిగిన మార్కెట్ వాడుకోవాలని ప్రతీ ఒక్కరు రూట్స్ ను వదిలేసి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మేకర్స్ బడ్జెట్ లు పెంచేస్తున్నారు…దాంతో మేకర్స్ బిజినెస్ సరిగ్గా జరగగా రిలీజ్ అయిన తక్కువ గ్యాప్ లో OTT కి అమ్మేయడం, ప్రభుత్వాలను సంప్రదించి టికెట్ హైక్స్ పెట్టుకుని మొదటి వారాల్లోనే ఎంత వీలయితే అంత వెనక్కి వచ్చేలా చేసుకోవడం చేస్తున్నారు…

వీటి వలన నార్మల్ జనాలకు, ఫ్యామిలీస్ కి సినిమాను దూరం చేసి ఇష్టం వచ్చినట్లు టికెట్ రేట్స్, థియేటర్స్ లో ఖర్చులతో ఆడియన్స్ ను చాలా తక్కువ మందికే పరిమితం చేస్తున్నారు. ఇక సింగిల్ స్క్రీన్స్ మనుగడ మరింత కష్టం అయిపొయింది….ఎంతో కొంత బజ్ ఉంటే తప్ప టికెట్స్ తెగని పరిస్థితి…

AP-TG 9th Day Highest Share Movies

అలాంటి సినిమాలు సంక్రాంతికో, దసరాకో తప్పితే నార్మల్ టైంలో రావడం లేదు….ఇంత మంది స్టార్స్ ఉన్న టాలీవుడ్ లో కొందరు ఏడాదికి 2 సినిమాలు మిగిలిన వాళ్ళు ఏడాది ఒక్క పెర్ఫెక్ట్ మూవీని రిలీజ్ చేసినా కూడా సింగిల్ స్క్రీన్స్ తో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి కప్పుడు ప్రేక్షకులు సినిమాలను చూడటానికి ఎగబడే వాళ్ళు….

కానీ రీసెంట్ టైంలో మన స్టార్స్ అందరి సినిమాలు ఒక ఏడాదిలో రిలీజ్ అవ్వడం అన్నది ఆల్ మోస్ట్ జరగలేదు అనే చెప్పాలి…ఇండియాలోనే బెస్ట్ మూవీ లవర్స్ గా పేరున్న టాలీవుడ్ ఆడియన్స్ మంచి సినిమాలు పెద్ద స్టార్స్ సినిమాల కోసం ఆవురావురుమని ఎదురు చూస్తున్నారు, కానీ చాలా వరకు టాప్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా మూవీస్ తో బిజీగా ఉండటంతో…

ఎప్పుడో కానీ సినిమాలు రిలీజ్ అవ్వడం లేదు…ఇక మీడియం రేంజ్ హీరోలలో కూడా కొందరు బడ్జెట్ లను పెంచేసుకుని పాన్ ఇండియా మార్కెట్ కి ట్రై చేస్తూ లోకల్ మార్కెట్ ని పూర్తిగా మర్చిపోతూ తమ మార్కెట్ కే ఎసరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు…ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోల సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ ఉండేది…

కానీ ఇప్పుడు వాళ్ళ సినిమాలకు సింగిల్ స్క్రీన్స్ లో ఏదైనా అద్బుతమైన టాక్ వస్తే తప్ప టికెట్స్ తెగని పరిస్థితి ఉంది….ఇక పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ చేస్తున్న సినిమాలు ఏమైనా వర్కౌట్ అవుతున్నాయా అంటే….పది సినిమాల్లో ఒకటి సక్సెస్ అవ్వడం కూడా పెద్ద విషయమే అని చెప్పాలి….

టాలీవుడ్ ఒకప్పటిలా మారాలి…స్టార్స్ అందరూ ఏడాదికి రెండు కాక పోయినా ఏడాదిన్నర గ్యాప్ లో అయినా 2 సినిమాలు చేయాలి….మిగిలిన యాక్టర్స్ ఏడాదికి 2 సినిమాలు చేస్తే మన మార్కెట్ కి తిరుగు ఉండదు, కానీ కథలు లేవని, మార్కెట్ ఉచ్చులో పడిపోయిన మన స్టార్స్ మొత్తానికి ఎప్పుడో కానీ సినిమాలను వదలం అంటే చాలా వరకు థియేటర్స్ తగ్గిపోతాయి..చూసేవాళ్ళు తగ్గిపోతారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here