టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ని సొంతం చేసుకుని దూసుకు పోతున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత తన క్రేజ్ ఎల్లలు దాటగా హిందీ లో అయితే అక్కడ స్టార్ హీరోల రేంజ్ కి చేరుకుంది. సాహో సినిమా అక్కడ సాధించిన అద్వీతీయ విజయమే దీనికి కారణం అని చెప్పొచ్చు..ఇక ఇప్పుడు జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ….
రాధే శ్యామ్ అఫీషియల్ ఫస్ట్ లుక్ ని టైటిల్ ని రీసెంట్ గా అనౌన్స్ చేయగా ఫ్యాన్స్ 24 గంటల్లో భారీ ట్రెండ్ చేసి 6.3 మిలియన్ ట్వీట్స్ తో కొత్త రికార్డులు నమోదు చేశారు… ఇక ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన టైం లో ఇండస్ట్రీ లో అలాగే సోషల్ మీడియా లో కూడా…
సినిమా స్టొరీ పాయింట్ పై రకరకాల కథలు వినిపించగా ఓ కథ మాత్రం బాగా పాపులర్ అయింది. ఆ కథ ఏంటి అంటే….. 1880 లో ప్రేమికులు అయిన రాధ(ప్రభాస్) శ్యాం(పూజా) ఒక ప్రవాహంలో మరణిస్తారు… తిరిగి వారే పేర్లు మార్చుకుని ప్రస్తుతం జన్మించి పుడతారు… ఈ సారి విధి మళ్ళీ వెక్కిరించాగా….
కలిసే ఉన్నారా లేక విడిపోయారా అన్నది కథ అంటున్నారు… డైరెక్టర్ కూడా రాదే శ్యాం…శ్యామే రాదా అంటూ హింట్ కూడా ఇవ్వడం తో ఇదే అటూ ఇటూగా కథ పాయింట్ అని అంటున్నారు. ఇది పునర్జన్మల కథ అని చెప్పక పోయినా కథ భాగం చాలా వరకు ఇప్పటి కాలమానం కాకుండా ఓల్డ్ కాలమానం ప్రకారం జరుగుతుందని చెప్పారు…
ఆ లెక్క ప్రకారం ఈ కథ కొంచం సినిమా కథ ని పోలి ఉందని చెప్పాలి… పునర్జన్మ ల నేపధ్యంలో చాలా సినిమాలు ఇప్పటికే వచ్చాయి.. పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమా ఇంత సింపుల్ కథ తో అయితే వచ్చి ఉండదు… వచ్చినా స్క్రీన్ ప్లే మరో లెవల్ లో ఉండే చాన్స్ ఉంటుంది… ఏది నిజం అన్నది వచ్చే ఇయర్ లో తెలుస్తుంది…