Home గాసిప్స్ ఆ టైటిల్ లేనట్టే?….ఎన్టీఆర్30 న్యూ అప్ డేట్!

ఆ టైటిల్ లేనట్టే?….ఎన్టీఆర్30 న్యూ అప్ డేట్!

0

5 సినిమాలు గా ఒక్క అపజయం లేకుండా దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు రెండేళ్ళ టైం ని ఇప్పుడు ఒక్క సినిమాకే కేటాయించాల్సి రాగా.. మరో ఏడాది కూడా ఇప్పుడు ఆ సినిమా కోసమే కేటాయించాల్సిన పరిస్థితి నెల కొంది. దాంతో దాదాపు మూడేళ్ళ తర్వాత ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ రాబోతుండ గా…. అది మల్టీ స్టారర్ కాబట్టి సోలో మూవీ కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

కాగా తన కి అరవింద సమేత తో కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో త్వరలోనే అప్ కమింగ్ మూవీ చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తీ అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని ఫిక్స్ అవ్వగా ఈ సినిమా గురించిన ఓ అప్ డేట్ ఇప్పుడు…

ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, ఆ అప్ డేట్ ఏంటంటే…. సినిమా కోసం ముందుగానే నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ లో “అయినను పోయి రావలె హస్తినకు” అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు… కానీ సినిమా స్క్రిప్ట్ పాన్ ఇండియా లెవల్ కి సపోర్ట్ చేసే రేంజ్ లో వస్తుండటం తో…

యూనిట్ అండ్ డైరెక్టర్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రూపొందిస్తే ఆ టైటిల్ సెట్ అవ్వదు అని ఫిక్స్ అయ్యారని లేటెస్ట్ గాసిప్… ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉండగా ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్ టైటిల్స్ కోసం యూనిట్ వెతుకుతున్నారని అంటున్నారు. కాగా ఇందులో కొన్ని కీలక రోల్స్ కి కూడా…

India's Biggest Birthday Trend Record Belongs To #HappyBirthdayNTR

బాలీవుడ్ వాళ్ళని అప్రోచ్ అవుతున్నారని టాక్… దాంతో సినిమా పాన్ ఇండియా లెవల్ లో రూపొందే అవకాశమే ఎక్కువగా ఉందని చెప్పాలి. కరోనా ఎఫెక్ట్ లేకుంటే సినిమా ఆల్ మోస్ట్ మొదలు అయి ఉండేది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృశ్యా దసరా కి మొదలు పెట్టి వచ్చే ఇయర్ సెకెండ్ ఆఫ్ లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here