కరోనా ఎఫెక్ట్ వలన చాలా సినిమాలు రిలీజ్ లు ఆగిపోయి ఎం చేయలేని స్థితి లో ఉండగా వాళ్ళని చాలా వరకు ఆదుకోవడానికి OTT యాప్స్ ముందుకు వచ్చాయి… చిన్న పెద్ద తేడా లేకుండా ఇప్పటికే చాలా సినిమాలను కొనేసి ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేస్తూ వస్తున్నాయి. టాలీవుడ్ లో కేవలం చిన్న సినిమాలకే పరిమితం అయిన ఈ పద్దతి బాలీవుడ్ లో మాత్రం పీక్స్ లో ఉండనే చెప్పాలి.
అక్కడ భారీ సినిమాలు కూడా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి సిద్ధ పడటం టాక్ ఆఫ్ టౌన్ గా మారింది. వాటిలో ఈ ఏడాది తానాజీ ది అన్ సంగ్ వారియర్ సినిమా తో ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న అజయ్ దేవగన్ నటిస్తున్న…
కొత్త సినిమా భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా కూడా ఉంది. ఈ సినిమా కి డిజిటల్ రిలీజ్ కి గాను భారీ బిజినెస్ దక్కగా OTT లో రిలీజ్ అవుతున్న సినిమా లో ఇది ఇండియా వైడ్ గా టాప్ 2 బిగ్గెస్ట్ రేటు అని చెప్పాలి.
మొదటి ప్లేస్ లో అక్షయ్ కుమార్ నటిస్తున్న లక్ష్మీ బాంబ్ మూవీ సుమారు 125 కోట్లకు అటూ ఇటూగా రేటు ని సొంతం చేసుకోగా… అజయ్ దేవగన్ నటించిన భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా కి గాను అక్షరాలా 110 కోట్ల రేటు దక్కిందని సమాచారం. అజయ్ దేవగన్ తానాజీ ది అన్ సంగ్ వారియర్ సినిమాను ఓవరాల్ గా…
80 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ అలాగే 25 కోట్లకు స్ట్రీమింగ్ రైట్స్ ని అమ్మారు. ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడు 5 కోట్లు అధికంగా 110 కోట్లు ఓవరాల్ గా డిజిటల్ రిలీజ్ కి దక్కుతుండటం విశేషం. కానీ అదే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి హిట్ అయ్యి ఉంటె సినిమా లాభాలలో కూడా ప్రాఫిట్ వచ్చి ఉండేది.. ఇప్పుడు ఆ అవకాశం లేదని చెప్పాలి..