Home గాసిప్స్ కొత్త న్యూస్….2 బ్లాక్ బస్టర్ల డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా?

కొత్త న్యూస్….2 బ్లాక్ బస్టర్ల డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా?

0

రీసెంట్ టైం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై వచ్చినన్ని గాసిప్స్ మరే హీరో పై కూడా రాలేదు అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేయబోయే సినిమాలు ఏంటి అనేవి అస్సలు కన్ఫాం కాక పోవడం నిర్మాతగా చిరు అప్ కమింగ్ మూవీస్ తో బిజీ గా ఉండటం తో రామ్ చరణ్ కొత్త సినిమాల కమిట్ మెంట్స్ లేట్ గా జరుగుతున్నాయి.

దాంతో రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీస్ పై వార్తలు శిఖారు చేస్తూనే ఉన్నాయి. స్పెషల్ రోల్స్ పక్కకు పెడితే హీరోగా సురేందర్ రెడ్డి తో, వక్కంతం వంశీ తో అని, కొత్త డైరెక్టర్ తో అని, మజిలీ ఫేం శివ నిర్వాణ తో సినిమా అని….

వంశీ పైడిపల్లి తో అని, కొరటాల శివ తో అని, త్రివిక్రమ్ తో అని… ఇలా రీసెంట్ టైం లో రామ్ చరణ్ పై వచ్చినన్ని న్యూసులు మరే హీరో పై కూడా రాలేదు. ఇక ఇందులో ఏవి ఇప్పటి వరకు నిజం కాలేదు కానీ ఇప్పుడు లేటెస్ట్ గా మరో న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.

టాలీవుడ్ లో రెండేళ్ళ క్రితం ఛలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్ళీ రెండేళ్ళ కి భీష్మ సినిమా తో మరో బ్లాక్ బస్టర్ ని అందుకున్న డైరెక్టర్ వెంకీ కొడుముల డైరెక్షన్ లో రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ ఉండబోతుంది అని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ న్యూస్. కాగా వెంకీ కొడుముల చెప్పిన కథ…

ఎంటర్ టైన్ మెంట్ ఫుల్లుగా ఉందని రామ్ చరణ్ ఇప్పటి వరకు ఇలాంటి ఎంటర్ టైన్ మెంట్ మూవీ చేయలేదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యే అవకాశం ఉందని ఆల్ రెడీ రూమర్స్ వస్తున్నాయి. మరి ఇదైనా నిజం అవుతుందో లేదో అన్నది మరో కొన్ని రోజుల్లో తేలనుంది అని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here