సుశాంత్ సింగ్ రాజ్ పుత్…. బాలీవుడ్ యంగ్ హీరో…టాప్ హీరోల రేంజ్ కి వెళ్ళే సత్తా ఉన్న హీరో… మానసిక కారణాల వల్ల ఈ లోకాన్ని వీడిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి సినిమా దిల్ బేచారా థియేటర్స్ లో చూసి తనకి తమ వంతుగా ఘనమైన నివాళి ఇవ్వాలి అని కోరుకొని వారు లేరు, కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలించక పోవడం తో ఈ సినిమాను డైరెక్ట్ గా…
డిజిటల్ రిలీజ్ చేశారు…. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఈ చివరి సినిమా తనని మరొక్క సారి బిగ్ స్క్రీన్ పై చూడాలి అనుకున్న వాళ్ళందరినీ ఎంతో ఎమోషనల్ అయ్యేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి సినిమా విశేషాలలోకి వెళితే…
కథ ఏంటంటే… కాన్సర్ తో భాద పడే హీరోయిన్ లైఫ్ లోకి హీరో ఎంటర్ అయ్యాక తన లైఫ్ చాలా సంతోషంగా మారుతుంది.. కానీ తర్వాత ఒక ఆల్బం ని సగం లో ఆపేసిన మ్యూజిషియన్ ని వెతుకుతూ పారిస్ కి వెళతారు హీరో హీరోయిన్స్… అక్కడ మరో షాకింగ్ నిజం తెలుస్తుంది..
అదేంటి… తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే… సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రతీ సీన్ లో జీవించాడని చెప్పాలి. తనలో ఉన్న అద్బుత నటన సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ తన ఎక్స్ ప్రెషన్స్ అన్నీ అద్బుతం.
తన చివరి సినిమా అవ్వడం తో ఆడియన్స్ ప్రతీ సీన్ లో ఎంతో ఎమోషనల్ అవ్వడం ఖాయం. ఇక హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, ఇద్దరి జోడి కూడా బాగా సెట్ అయింది. ఇక ఇతర స్టార్ కాస్ట్ కూడా ఆకట్టుకోగా రెహ్మాన్ అందించిన సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ఎమోషనల్ అయ్యేలా చేశాయి అని చెప్పాలి.
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పెర్ఫెక్ట్ గా సెట్ అయింది, ఎలాంటి లాగ్ లేకుండా డైరెక్టర్ సినిమా లెంత్ చాలా క్రిస్ప్ అండ్ క్లియర్ గా తెరకెక్కించాడు… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాట్చ్ అనిపించే విధంగా ఉన్నాయి. మొత్తం మీద సినిమా ఎమోషనల్ జర్నీ అవ్వడంతో…
చూస్తున్న వాళ్ళు అందరూ సుశాంత్ ని అస్సలు మర్చిపోలేరు అని చెప్పాలి… సినిమా లో కూడా పుట్టుక చావు గురించి హీరో డైలాగ్స్ చెబుతున్నప్పుడు కంటి నుండి నీరు రావడం ఖాయం… సినిమాలో అంత ధైర్యంగా ఉన్న హీరో ఆ ఒక్క రోజు ధైర్యం చేసి ఉంటే ఎంత బాగుణ్ణు అని కోరుకొని వారు కూడా ఉండరు…
కోట్ల మంది ఫ్యాన్స్ ని వదిలి వెళ్ళిన సుశాంత్ నటించిన చివరి సినిమా అయిన దిల్ బెచారా తనకి ఘన నివాళి అని చెప్పాలి. తనని చివరి సారి చూడాలి అనుకున్న వాళ్లకి ఇది ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. కచ్చితంగా సినిమా ను ఒక్కసారైనా చూసి సుశాంత్ ని మరొక్క సారి అందరూ గుర్తు చేసుకుని తీరాల్సిందే..