Home TRP రేటింగ్ కోలివుడ్ TRP రికార్డుల బెండు తీస్తున్న అజిత్…3 సార్లు మూడు కొత్త రికార్డులు!!

కోలివుడ్ TRP రికార్డుల బెండు తీస్తున్న అజిత్…3 సార్లు మూడు కొత్త రికార్డులు!!

0

కోలివుడ్ లో అల్టిమేట్ క్రేజ్ ఉన్న స్టార్ హీరోల్లో అజిత్ కూడా ఒకరు… రీసెంట్ టైం లో సరైన సినిమాలు పడక ఆఖలి మీదున్న ఫ్యాన్స్ కి విశ్వాసం సినిమాతో విందు భోజనం పెట్టాడు అజిత్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా భారీ పోటి లో కూడా 190 కోట్లకు పైగా గ్రాస్ ని వసూల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి అజిత్ కి అల్టిమేట్ కంబ్యాక్ గా నిలిచింది..

తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమా కోలివుడ్ రికార్డులు అన్నీ తిరగరాసి మెంటల్ మాస్ రికార్డ్ ను నమోదు చేసింది. అంతకుముందు కోలివుడ్ లో బిగ్గెస్ట్ TRP రేటింగ్ ని బిచ్చగాడు సినిమా సొంతం చేసుకుంది. ఆ సినిమా 17 లక్షల 69 వేల ఇంప్రెషన్స్ ని అందుకోగా…

TRP రేటింగ్ లెక్కల్లో ఇది 24.5 వరకు ఉంటుందని అంచనా…కాగా విశ్వాసం సినిమా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి 18 లక్షల 14 వేల ఇంప్రెషన్ పాయింట్స్ అంటే TRP రేటింగ్ లెక్కల్లో 26 కి TRP రేటింగ్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఇక రీసెంట్ గా సినిమా మరో 2 సార్లు టెలికాస్ట్ అవ్వగా….

రెండు సార్లు కూడా సెన్సేషనల్ TRP రేటింగ్ తో దుమ్ము దుమారం చేసింది, సినిమా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు 15 లక్షల 59 వేల ఇంప్రెషన్స్ ని అందుకోగా TRP రేటింగ్ లెక్కల్లో 20.4 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఇక మూడో సారి టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమా..

16 లక్షల 12 వేల ఇంప్రెషన్స్ ని అందుకోగా TRP రేటింగ్ లెక్కల్లో 21.4 TRP రేటింగ్ ని అందుకుని సంచలనం సృష్టించింది. మూడు సార్లు టెలికాస్ట్ అయినప్పుడు 20 కి పైగా TRP రేటింగ్ ని అందుకున్న మొట్ట మొదటి సౌత్ మూవీ గా సంచలన రికార్డ్ ను నమోదు చేసి ఊచకోత కోసింది ఈ సినిమా.. ఇక లాంగ్ రన్ లో మరెన్ని రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here