టాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సినిమాలు చాలా ఉన్నాయి… వాటిలో ఐదేళ్ళ క్రితం వచ్చిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఉంది. ఆ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిన పెద్ద సినిమాల్లో ఒకటి. అలాంటి సినిమా ను తెలుగు లో ముందు డబ్ చేసి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ రీమేక్ చేస్తే సూపర్ సక్సెస్ అవుతుంది అని భావించి చాలా మంది స్టార్ హీరోలను అప్రోచ్ అయ్యారు.
ఆ సినిమానే అజిత్ కుమార్ నటించిన వేదళం సినిమా.. ఈ సినిమా అందరికన్నా ముందు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళింది, కానీ అప్పటికే ఇలాంటి కాన్సెప్ట్ తో ఊసరవెల్లి చేసి ఉండటం తో నో చెప్పాడు ఎన్టీఆర్. ఇక తర్వాత బాలయ్య దగ్గరకు, వెంకటేష్ దగ్గరకు వెళ్ళింది ఈ సినిమా.
కానీ వారు కూడా నో చెప్పగా… పవన్ కళ్యాణ్ ఆ టైం లో ఓ రీమేక్ కోసం వెతుకుతుండగా ఈ సినిమా ఆఫర్ వెళ్ళినప్పటికీ ఎందుకనో నో చెప్పి అజిత్ నటించిన వీరం సినిమాను కాటమరాయుడు పేరుతొ రీమేక్ చేశాడు. తర్వాత రెండేళ్ళుగా సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు.
ఇక మళ్ళీ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఇస్తున్న టైం లో ఈ రీమేక్ మళ్ళీ తెరపైకి రాగా ఎందుకనో మళ్ళీ నో చెప్పి పింక్ రీమేక్ వకీల్ సాబ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఇక రీసెంట్ గా చిరంజీవి దగ్గరకు వచ్చి ఆగిన ఈ సినిమా చిరు ఎస్ ఆర్ నో చెప్పక పోవడం తో మళ్ళీ ఆగిపోయింది.
సినిమా రీమేక్ రైట్స్ ని 5 ఏళ్ల క్రితమే 1.5 కోట్లు చెల్లించి దక్కించుకోగా తెలుగు లో స్టార్ హీరోతో చేస్తే కచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నప్పటికీ ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ని చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు. మరి ఈ రీమేక్ అసలు మొదలు అవుతుందా లేక కంప్లీట్ గా ఆగిపోతుందో చూడాలి మరి….