Home గాసిప్స్ రిస్క్ తీసుకుంటా అంటున్న మెగాస్టార్….నో చెబుతున్న రామ్ చరణ్!

రిస్క్ తీసుకుంటా అంటున్న మెగాస్టార్….నో చెబుతున్న రామ్ చరణ్!

328
0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా ను అక్టోబర్ లో రిలీజ్ చేసి తన కొత్త సినిమాను ఈ ఇయర్ లో మొదటి పెట్టి కొంత భాగం షూటింగ్ చేసినప్పటికీ కరోనా ఎఫెక్ట్ తో అన్ని సినిమాల మాదిరిగా ఆగిపోయిన విషయం అందరికీ తెలిసిందే, ఇప్పుడు తిరిగి పర్మీషన్స్ వచ్చినప్పటికీ కూడా కరోనా వీర లెవల్ లో రెచ్చిపోతున్న నేపధ్యంలో ఎవ్వరూ కూడా షూటింగ్స్ ని వెల్లడానికి ఇష్ట పడటం లేదు.

ఇది హీరోల వర్షన్ స్టొరీ అయితే…. మరో పక్క ఈ సినిమా డైరెక్టర్ అయిన కొరటాల శివ లాస్ట్ మూవీ భరత్ అనే నేను 2018 సమ్మర్ లో రాగా ఇప్పటికి రెండేళ్ళు పూర్తీ అయిపోయి మూడో ఏడాది మొదలు అయ్యింది. ఈ సినిమా కథ రాసుకోవాడానికి ఏడాది టైం పోయినా…

చిరు తో సినిమా మొదలు పెట్టడం తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృశ్యా మరో ఏడాది టైం పట్టేలా ఉండటం తో కొరటాల సైడ్ నుండి కూడా ఆలోచించి చిరు రిస్క్ తీసుకుని అయినా షూటింగ్ చేద్దాం అంటూ కొరటాలకి రామ్ చరణ్ ని చెప్పుకొచ్చారట.

ఒక టాప్ డైరెక్టర్ ని ఇన్నాళ్ళు లాక్ చేసి ఉంచడం తప్పు అని ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధం అవ్వగా రామ్ చరణ్ ప్రస్తుతం పరిస్థితులను గమనించి ఎట్టి పరిస్థితులలో కూడా ఇప్పుడు షూటింగ్స్ అవసరం లేదని అంతా సద్దుకున్నాకే షూటింగ్ కి వెళదామని చెప్పుకోచ్చారట. కొరటాల శివ కూడా ఎలాగూ ఆలస్యం అయ్యింది కాబట్టి మంచి ప్రాడక్ట్ తో…

ప్రేక్షకుల ముందుకు వద్దామని చెప్పుకొచ్చారని తెలుస్తుంది. మొత్తం మీద ముగ్గురికి కూడా అద్బుతమైన అండర్ స్టాండింగ్ ఉండటంతో ఇక ఆలస్యం అయినా కానీ ఆడియన్స్ అంచనాలను మించే విధంగా రావడమే మన చేతుల్లో ఉందని భావిస్తున్నారట. దాంతో ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఏడాది సమ్మర్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here