ఒకపక్క మలయాళ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి వరుసగా తెలుగు లో రీమేక్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా మరో పక్క అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా వీడియో వాళ్ళు ఒక్కో తమిళ్ అండ్ మలయాళ మూవీ ని తెలుగు లో డబ్ చేసి డైరెక్ట్ రిలీజ్ చేస్తూ దూసుకు పోతున్నారు, రీసెంట్ గా జిప్సీ, 36 వయసులో సినిమాలను తెలుగు లో డైరెక్ట్ గా రిలీజ్ చేయగా ఇప్పుడు ఓ కొత్త సినిమాను చేయబోతున్నారు.
ఈ ఏడాది మలయాళం లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఫోరెన్సిక్ మూవీ కూడా ఒకటి ధనుష్ మారి 2 లో విలన్ గా చేసిన టోవినో థామస్ హీరోగా మమతా మోహన్ దాస్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది.
రాక్షసుడు తరహాలో సస్పెన్స్ మర్డర్ మిస్టరీ గా తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగే స్క్రీన్ ప్లే తో రూపొందుతుంది, క్లైమాక్స్ ఒక్కటి పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది కానీ ఓవరాల్ గా సినిమా ఆడియన్స్ ని ఓ రేంజ్ లో అలరించే కంటెంట్ ఉన్న సినిమాగా చెప్పుకోవచ్చు.
అలాంటి సినిమా ను తెలుగు లో డబ్ చేసి ఈ నెల 31 న డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ని ఆహా వీడియో యాప్ లో చేయబోతున్నారు. కాగా సినిమా తెలుగు రైట్స్ ని సుమారు 1.5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి తీసుకున్నారని టాక్ ట్రేడ్ లో వినిపిస్తుంది, ఒకవేళ డబ్ చేసి తెలుగు లో రిలీజ్ చేసినా ఇదే రేంజ్…
బిజినెస్ ని సినిమా సొంతం చేసుకుని ఉండేదేమో… ఓవరాల్ గా సినిమా OTT ఆడియన్స్ మనసు గెలిచే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇక సినిమా ఈ నెల 31 న డైరెక్ట్ గా రిలీజ్ కానుండగా అదే రోజు ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా కూడా డైరెక్ట్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.