బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడవి శేష్ అద్బుతమైన ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. క్షణం, అమీ తుమీ, గూఢచారి మరియు ఎవరు సినిమా లతో నాన్ స్టాప్ హిట్స్ కొడుతూ దూసుకు పోతున్న అడవి శేష్ ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీస్ తో బిజీగా ఉండ గా అందులో ఒకటి గూఢచారి సినిమా సీక్వెల్ కాగా మరొకటి ప్రస్తుతం చేస్తున్న మేజర్ సినిమా.
కాగా లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం తన అప్ కమింగ్ మూవీస్ జాబితాలో ఇప్పుడు మరో సినిమా కూడా చేరబోతుందని అంటున్నారు. బాలీవుడ్ లో రెండేళ్ళ క్రితం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఓ చిన్న సినిమా ను రీమేక్ చేస్తున్నారట.
ఆ సినిమానే ఆర్టికల్ 15, ఆయుష్మాన్ ఖురానా హీరోగా చేసిన ఈ సినిమా కాస్ట్ వ్యవస్థ మీద తక్కువ జాతి వాళ్ళు సమాజంలో ఎదురుకునే పరిస్థితుల మీద తెరకెక్కిన సినిమా, అసలు ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా హిందీ లో మౌత్ టాక్ తోనే సూపర్ హిట్ గా నిలిచింది.
లాంగ్ రన్ లో హిందీ లో 70 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని అందుకుని సూపర్ డూపర్ హిట్ అనిపించుకున్న ఈ సినిమా ను అప్పుడే తమిళ్ అండ్ తెలుగు లో రీమేక్ చేయాలి అనుకున్నారు కానీ కొంచం డిలే అవ్వగా ఇప్పుడు తెలుగు రీమేక్ కోసం అడవి శేష్ ని సంప్రదించారు అన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.
అడవి శేష్ కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అని టాక్ ఉంది, కొంచం ఆఫ్ బీట్ మూవీ నే అయినా కానీ కంటెంట్ ఉన్న సినిమా అవ్వడం, అడవి శేష్ ఇలాంటి డిఫెరెంట్ మూవీస్ ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వస్తుండటం తో ఇక్కడ కూడా వర్కౌట్ అయ్యే అవకాశం లేకపోలేదు అని చెప్పాలి. త్వరలోనే సినిమా పై అఫీషియల్ న్యూస్ రావొచ్చని అంటున్నారు..