Home గాసిప్స్ ఒక్కరే అనుకుంటే ఇద్దరు…మళ్ళీ రచ్చ లేపనున్న విజయ్!!

ఒక్కరే అనుకుంటే ఇద్దరు…మళ్ళీ రచ్చ లేపనున్న విజయ్!!

652
0

ఒకటి తర్వాత ఒకటి వరుస హిట్స్ తో దూసుకు పోతున్న కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ కెరీర్ లోనే ది బెస్ట్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో చేసిన సినిమా చేసినట్లు సంచలన రికార్డులను నమోదు చేస్తుండగా మరో పక్క ప్రతీ సినిమా లో కూడా తన నటనతో మరింత మెప్పిస్తున్నాడు విజయ్. ఇక తన రీసెంట్ మూవీస్ ని గమనిస్తే…

సర్కార్ మూవీ తప్పితే మెర్సల్ మరియు బిగిల్ సినిమాల్లో డ్యూయల్ అండ్ ట్రిబుల్ రోల్స్ తో దుమ్ము దుమారం చేశాడు విజయ్. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు మాస్టర్ సినిమా తో రాబోతున్న విజయ్ అన్నీ అనుకున్నట్లు జరిగితే సమ్మర్ రేసు లోనే ఎంటర్ అయ్యేవాడు కానీ…

కరోనా ఎఫెక్ట్ తో సినిమా పోస్ట్ పోన్ ల మీద పోస్ట్ పోన్ లు అవుతూ ప్రస్తుతానికి దీపావళి అంటున్నారు కానీ అప్పటికి డౌట్ గానే కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో విజయ్ సింగిల్ రోల్ లోనే కనిపిస్తారు అని అంతా అనుకున్నారు కానీ కోలివుడ్ లో లేటెస్ట్ గా…

వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాలో విజయ్ మళ్ళీ డ్యూయల్ రోల్ లో దుమ్ము లేపబోతున్నారని సమాచారం… ఒకటి మాస్టర్ రోల్ అని మరొకటి మాఫియా డాన్ రోల్ అని అంటున్నారు. మాఫియా డాన్ మాస్టర్ ప్లేస్ లో ఎంటర్ అవ్వడం సినిమాలో హైలెట్ అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉండగా…

సినిమా ప్రోమో సాంగ్స్ చూస్తె ఇది నిజమేనేమో అన్న డౌట్ అయితే ఉందని చెప్పాలి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అల్టిమేట్ హిట్స్ గా నిలవగా తెలుగు లో సినిమా పాటలు ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ ఇయర్ ఎండ్ లో వస్తుంది అంటున్న ఈ సినిమా తో ఇప్పుడు డ్యూయల్ రోల్ లో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతున్నాడు దళపతి విజయ్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here