టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్ రాజేశేఖర్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలమే అయింది, రీసెంట్ టైం లో కొంచం మంచి క్వాలిటీ ఉన్న సినిమాలు చేస్తున్నా వాటి బడ్జెట్ లెక్కలు వేరు అవ్వడం, అవి రికవరీ అవ్వలేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్స్ గా మిగిలిపోయాయి. ముఖ్యంగా గరుడవేగ సినిమా కి సూపర్ హిట్ టాక్ వచ్చినా సినిమా బిజినెస్ ని అందుకోలేక ఫ్లాఫ్ అయింది.
ఇక తర్వాత చేసిన కల్కి కూడా మంచి టాక్ నే సొంతం చేసుకున్నా ఓవర్ బడ్జెట్ అండ్ బిజినెస్ వలన బ్రేక్ ఈవెన్ కాలేక పోయింది. ఇలాంటి టైం లో కొంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్ ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ ని ఫ్లాఫ్ డైరెక్టర్ అయినా కానీ…
మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరున్న నీలకంఠ డైరెక్షన్ లో చేయబోతున్నాడు అన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్. కెరీర్ మొదట్లో మిస్సమ్మ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నీలకంఠ, తర్వాత నందనవనం120, విరోధి మరికొన్ని మంచి సినిమాలు చేసినా కానీ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర…
విజయాలను అందుకోలేక పోయాయి, కానీ డైరెక్టర్ గా తనకి మంచి పేరుని తీసుకొచ్చాయి. దాంతో తనతో తన అప్ కమింగ్ మూవీ ని రాజశేఖర్ త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. సినిమా కథ పాయింట్ ఏంటనేది చెప్పకున్నా కానీ మిస్సమ్మ తరహా ఓ మంచి ఎంటర్ టైనర్ ని తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు.
రీసెంట్ టైం లో రాజశేఖర్ కూడా ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ అస్సలు చేయలేదు, దాంతో ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్నారని గాసిప్. మరి రాజశేఖర్ ఈ సినిమా తో అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది దుమ్ము లేపుతారో లేదో చూడాలి మరి…