Home న్యూస్ అందరి క్రేజ్ ఒకెత్తు…విజయ్ క్రేజ్ మరో ఎత్తు…..19 ఏంటి సామి!!

అందరి క్రేజ్ ఒకెత్తు…విజయ్ క్రేజ్ మరో ఎత్తు…..19 ఏంటి సామి!!

0

సోషల్ మీడియా లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి కూడా ఒకరు, సోషల్ మీడియా రికార్డుల విషయం లో విజయ్ ఫ్యాన్స్ మరో లెవల్ లో ఉంటారు, ఒక్క ట్రెండ్స్ విషయం లో చాలా స్లోగా ఉన్నారు కానీ టీసర్, ట్రైలర్ లకు లైక్స్ విషయం లో కానీ హీరో వేసే ట్వీట్స్ కి లైక్స్ అండ్ రీట్వీట్స్ చేయడం విషయం లో కానీ…

విజయ్ ఫ్యాన్స్ ఊపు మరో లెవల్ లో ఉంటుంది, రీసెంట్ గా మన టాలీవుడ్ హీరోల ట్వీట్స్ కి ఈ మధ్య చాలా సింపుల్ గా 1 లక్ష లైక్స్ వస్తున్నాయి అని, అదే సమయం లో ఇక్కడ విజయ్ కి ఆ లక్ష లైక్స్ చాలా తక్కువ సమయం లో దక్కడం విశేషం.

ఫాలోవర్స్ తక్కువగానే ఉన్నా కానీ విజయ్ ప్రొఫైల్ నుండి పడే ప్రతీ రీసెంట్ ట్వీట్ కూడా రికార్డ్ లెవల్ లో రీ ట్వీట్స్ ని లైక్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది, సౌత్ లో ట్విట్టర్ రికార్డులలో మొట్ట మొదటి లక్ష, రెండు లక్షలు, మూడు లక్షల…

లైక్స్ రికార్డ్ ను సొంతం చేసుకున్న మొట్ట మొదటి హీరో విజయ్ అనే చెప్పాలి. కాగా కేవలం తన ప్రొఫైల్ నుండే పడిన ట్వీట్స్ లో ఏకంగా 19 ట్వీట్స్ కి 1 లక్ష కి పైగా లైక్స్ దక్కడం తన క్రేజ్ కి నిదర్శనం అని చెప్పాలి. రీసెంట్ గా మహేష్ బాబు చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలను నాటిన విజయ్…

ఆ ఫోటోని షేర్ చేయగా ఫ్యాన్స్ విరగబడి లైక్స్ తో దూసుకుపోతున్నారు. దాంతో విజయ్ ఖాతాలో మరో రికార్డ్ చేరింది, సౌత్ లో విజయ్ కే హైయెస్ట్ లైకుడ్ ట్వీట్స్ ఓవరాల్ గా ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక విజయ్ నటిస్తున్న కొత్త సినిమా మాస్టర్ ఈ ఇయర్ ఎండ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here