కెరీర్ మొదలు పెట్టడం వరుస హిట్స్ తో మొదలు పెట్టినా తర్వాత కెరీర్ లో సరైన సినిమాలను ఎంచుకోవడంలో విఫలం అయిన యంగ్ హీరో రాజ్ తరుణ్ తర్వాత ఒకటి తర్వాత ఒకటి వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకోవడం తో పూర్తిగా తన మార్కెట్ నే కోల్పోయే స్టేజ్ కి వచ్చాడు, ఈ మధ్య రాజ్ తరుణ్ నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ గా నిరాశ…
పరిచి నష్టాలు కూడా తీవ్రంగా సొంతం చేసుకోగా తన లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా తో బాక్స్ ఆఫీస్ దగ్గ్గర కంబ్యాక్ ఇవ్వాలని చూశాడు రాజ్ తరుణ్, గుండెజారి గల్లంతైందే సినిమా డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా పై ఉన్నంతలో…
మినిమమ్ బజ్ బాగానే ఉండగా కరోనా వల్ల సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అవ్వగా సినిమా కి అప్పట్లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కింద 7.5 కోట్ల రేంజ్ ఆఫర్లు వచ్చాయి, కానీ అప్పుడు మరింత బెటర్ ఆఫర్ కోసం ఎదురు చూసిన టీం ఈ ఆఫర్ ని రిజక్ట్ చేయగా…
రీసెంట్ గా అన్ని సినిమాల రేట్లు ఒక్కసారిగా పడిపోగా ఆ ఇంపాక్ట్ ఈ సినిమా పై మరింతగా పడగా కొన్ని యాప్స్ 3.5 కోట్ల రేంజ్ రేటునే చెల్లిస్తాం అంటూ ముందుకు రాగా తెలుగు యాప్ అయిన ఆహా వీడియో వాళ్ళు మాత్రం కొంచం బెటర్ గా 4 కోట్ల రేంజ్ రేటు ఇస్తామని ముందుకు రాగా…
టీం వెంటనే ఈ రేటు కి ఓకే చెప్పిందని ట్రేడ్ లో వార్తలు ఉండగా ఇప్పుడు సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది, అక్టోబర్ 2 న సినిమా ఆహా వీడియో యాప్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది, అప్పుడే ఓకే అని ఉంటె మంచి రేటు దక్కి ఉండేది కానీ ఆలస్యం చేయడం తో ఇప్పుడు అందులో సగం రేటుకే సినిమా ను అమ్మేయాల్సి వచ్చింది అంటున్నారు…