Home గాసిప్స్ నెవర్ బిఫోర్-ఎవర్ ఆఫ్టర్…బాలయ్య మైండ్ బ్లాంక్ చేసే షాక్ ఇవ్వనున్నాడు!!

నెవర్ బిఫోర్-ఎవర్ ఆఫ్టర్…బాలయ్య మైండ్ బ్లాంక్ చేసే షాక్ ఇవ్వనున్నాడు!!

0

2019 ఇయర్ బాలయ్య కి ఏమాత్రం కలిసి రాలేదు….సంక్రాంతికి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ ఊహకందని డిసాస్టర్ గా మారిపోగా ఇయర్ ఎండ్ లో పూర్తీ డిఫెరెంట్ లుక్ తో బరువు తగ్గి బాలయ్య చేసిన రూలర్ సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక చేతులు ఎత్తేసింది. దాంతో 2019 ఇయర్ బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్యాడ్ ఇయర్స్ లో ఒకటిగా నిలిచి హాట్రిక్ ఫ్లాఫ్స్ తో భారీ షాక్ ఇచ్చింది.

ఇక ఇప్పుడు సింహా లెజెండ్ తో సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్న హాట్రిక్ సినిమా పై అన్ని ఆశలు పెట్టుకున్న బాలయ్య ఈ సినిమా కోసం ఇప్పటి వరకు చేయని భారీ రిస్క్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

బాలయ్య ఇందులో “అఘోరా” గా 30 నిమిషాల లెంత్ ఉండే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోకనిపించబోతున్న విషయం అందరికీ తెలిసిందే, లాక్ డౌన్ ముందు ఓ చిన్న షెడ్యూల్ జరగగా వారణాసిలో ఓ చిన్న షెడ్యూల్ లో సినిమా లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ కూడా చేసిన విషయం బోయపాటి రివీల్ చేయగా…

ఈ రోల్ పై లాక్ డౌన్ టైం లో బోయపాటి మరింత ఎఫెక్టివ్ గా స్క్రిప్ట్ ని రాసుకున్నారని సమాచారం. ముందు రాసుకున్న కథనే చాలా పవర్ ఫుల్ ఉండగా ఇప్పుడు అఘోరా క్యారెక్టర్ కి మరిన్ని ఎలివేషన్స్ ని రాసుకున్నారట. ఓవరాల్ గా కొన్ని మార్పులు జరిగిన స్క్రిప్ట్ చూసుకున్న తర్వాత బోయపాటి సినిమాపై మరో లెవల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారట.

ఇక బాలయ్య కి కూడా ఈ మార్పులు వినిపించగా ఎప్పుడెప్పుడు షూటింగ్ తిరిగి మొదలు పెడతామా అన్నంత ఆతృతగా బాలయ్య ఉన్నారని యూనిట్ నుండి సమాచారం… వీళ్ళ నుండి వచ్చిన న్యూస్ నిజం అయితే అఘోరా రోల్ లో బాలయ్య ఇప్పటి వరకు చేయని వీర విహారం వెండితెరపై చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో మొదలు కాబోతుందని సమచారం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here