సత్యదేవ్ హీరోగా మలయాళం లో సూపర్ హిట్ అయిన మహేశింతే ప్రతీకారం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోగా ఈ సినిమా ను తెలుగు లో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య పేరు తో రీమేక్ చేయగా సినిమా ను థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నా కరోనా పరిస్థితుల వలన డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు. తెలుగు డిజిటల్ రిలీజ్ అయిన సినిమాల్లో సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా….
ఇక సినిమా ఓవరాల్ గా డిజిటల్ రిలీజ్ అయ్యి 2 నెలలు కావస్తుండగా సినిమా కి సంభందించిన ప్రాఫిట్ వివరాలు ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి, ఒకసారి ఆ లెక్కలను గమనిస్తే… ముందుగా సినిమా బడ్జెట్ మొత్తం మీద 3 కోట్ల రేంజ్ లో ఉండగా…
సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ కి 4.5 కోట్ల రేటు కి అమ్మారు, ఇక సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని ఈటీవీ కి 2.2 కోట్ల రేంజ్ రేటు కి ఇవ్వగా మ్యూజిక్ రైట్స్ కింద 10 లక్షల దాకా రేటు వచ్చిందని సమాచారం. హిందీ డబ్బింగ్ రైట్స్ ఇంకా అమ్మకం బాలెన్స్ ఉంది.
ఓవరాల్ గా 3 కోట్ల బడ్జెట్ కి 6.8 కోట్ల బిజినెస్ చేసిన సినిమా 3.8 కోట్ల ప్రాఫిట్ ని ప్రొడక్షన్ హౌస్ కి ఇవ్వగా ఇక సినిమా ను కొన్న నెట్ ఫ్లిక్స్ కి రెండు నెలల్లో సాలిడ్ గా ప్రాఫిట్స్ దక్కాయని సమచారం. సినిమా మొదటి 10 రోజులు నాన్ స్టాప్ గా యాప్ లో ట్రెండ్ అవ్వగా… తర్వాత కూడా రెగ్యులర్ గా వ్యూస్ వస్తున్నాయని చెప్పారు. మొత్తం మీద ఈ రెండు నెలల్లో….
సినిమా ద్వారా నెట్ ఫ్లిక్స్ కి యావరేజ్ గా రెవెన్యు 5 కోట్ల నుండి 5.5 కోట్ల రేంజ్ లో వచ్చి ఉండొచ్చని అంటున్నారు. పెర్ఫెక్ట్ లెక్కలు కేవలం నెట్ ఫ్లిక్స్ కి నిర్మాతలకి మాత్రమె తెలుస్తాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం చూసుకున్నా నెట్ ఫ్లిక్స్ కి కూడా 1 కోటి కి తగ్గని ప్రాఫిట్ ఇప్పటికే రాగా లాంగ్ రన్ లో మరింత ప్రాఫిట్ ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా ఇటు నిర్మాతలకు, అటు కొన్న నెట్ ఫ్లిక్స్ కి సినిమా మంచి ప్రాఫిట్స్ తెచ్చి పెట్టింది.