Home గాసిప్స్ సైడ్ రోల్స్ నుండి హీరో….తిమ్మరుసు సినిమాకి సత్యదేవ్ రెమ్యునరేషన్ ఇదే!!

సైడ్ రోల్స్ నుండి హీరో….తిమ్మరుసు సినిమాకి సత్యదేవ్ రెమ్యునరేషన్ ఇదే!!

0

టాలీవుడ్ లో స్టార్ బ్యాగ్ డ్రాప్ లేకుండా ఎదగడం అన్నది చాలా కష్టం, కానీ అప్పుడప్పుడు కొందరు హీరోలు ఎలాంటి స్టార్ బ్యాగ్ డ్రాప్ లేకుండా ఒక్కో అడుగు ముందు కేస్తూ ఎదిగిన ఎదుగుతున్న వాళ్ళలో చిన్న హీరో సత్యదేవ్ కూడా ఒకరు. ఎలాంటి స్టార్ బ్యాగ్రౌండ్ లేకుండా చిన్న చిన్న సైడ్ రోల్స్ చేస్తూ అడపాదడపా కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేసిన తర్వాత ఎట్టకేలకు హీరోగా మారి తనకంటూ ఓ పేరును…

లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా తో సొంతం చేసుకుని ఇండస్ట్రీ లో చాలా మందికి సత్యదేవ్ పేరు తెలిసేలా చేశాడు. అంతకుముందు బ్లఫ్ మాస్టర్ సినిమా చేయగా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాను పెద్దగా ఎవరూ పట్టించు కోలేదు కానీ..

తర్వాత యూట్యూబ్ లో ఆ సినిమా చూసిన వారు అందరూ సత్యదేవ్ నటనని మెచ్చుకోగా తర్వాత జ్యోతిలక్ష్మీ, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాల్లో కీలక పాత్రలు చేసిన సత్యదేవ్ లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు తను చేసిన సినిమాలను ఎక్కువగా డిజిటల్ లో రిలీజ్ చేసినా పేరు బాగానే సొంతం చేసుకున్నాడు.

లాస్ట్ ఇయర్ ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య డిజిటల్ సూపర్ హిట్ తర్వాత సత్యదేవ్ కి మార్కెట్ కొంచం ఎక్స్ పాండ్ అయ్యింది. అంతకుముందు ఒక్కో సినిమా కి 20 నుండి 30 లక్షలు వరకు రెమ్యునరేషన్ ని తీసుకున్న సత్యదేవ్ లేటెస్ట్ గా చేసిన తిమ్మరుసు సినిమా కోసం కెరీర్ లో మొట్ట మొదటి సారిగా ఒక కోటి రేంజ్ లో…

రెమ్యునరేషన్ ని అందుకున్నాడని సమాచారం. ఓ చిన్న హీరో కి ఇది కెరీర్ లో అల్టిమేట్ అచీవ్ మెంట్ అని చెప్పొచ్చు. అది కూడా చిన్న చిన్న రోల్స్ నుండి ఇప్పుడు హీరోగా ఎదిగి తనకంటూ ఓ చిన్న మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడం బిగ్ అచీవ్ మెంట్… ఈ సినిమా తర్వాత చేసే సినిమాలకు 1.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని తీసుకుంటున్నాడట సత్యదేవ్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here