యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ ని కొట్టిన తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో చేసిన సినిమా సాహో… భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా నెగటివ్ రివ్యూ లను సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం దుమ్ము దుమారం లేపింది, హిందీ లో అయితే ఫ్లాఫ్ టాక్ తోనే సూపర్ హిట్ అనిపించుకుని అక్కడ ప్రభాస్ రేంజ్ ఏంటో చూపించింది.
అలాంటి సినిమా రిలీజ్ అయిన ఏడాది తర్వాత కూడా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వలేదు… సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ఎట్టకేలకు రిలీజ్ అయిన ఏడాది తర్వాత రీసెంట్ గా జీ తెలుగు వాళ్ళు కొన్నారు. కానీ ఇలా లేట్ అవ్వడానికి కారణం ఏంటి…
ఎందుకని లేట్ అయింది అన్న వివరాలు ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి… ఆ వార్తల ప్రకారం సినిమా కి పెట్టిన భారీ రేటు కి సాహో ని రిలీజ్ కి ముందు నుండే తెలుగు లో మాత్రమె 30 కోట్లకు తగ్గని రేటు కి అమ్మాలని ఫిక్స్ అయ్యారు నిర్మాతలు…
జెమినీ టీవీ నుండి సినిమా 24 కోట్ల దాకా ఆఫర్ వెళ్ళింది అప్పట్లో… కానీ నిర్మాతలు నో చెప్పి 30 కే ఫిక్స్ అయ్యారట. ఇక స్టార్ మా ఛానెల్ తర్వాత 25 కోట్ల దాకా వెళ్ళినా వీళ్ళు తగ్గలేదట. దాంతో ఆ రేటు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం తో శాటిలైట్ రైట్స్ అమ్మకం జరగకుండా అలానే ఉన్నాయి ఏడాదికి పైగా… సినిమా రిజల్ట్ తర్వాత కొంచం తగ్గి ఛానెల్స్ ని…
అప్రోచ్ అయినా ఎవ్వరూ కూడా ముందు చెప్పిన రేటు కి ఫిక్స్ కాలేదట… దాంతో ఇంత కాలం శాటిలైట్ రైట్స్ అలాగే ఉండగా రీసెంట్ గా జీ తెలుగు మొత్తం మీద 14.5 కోట్ల రేటు కి తెలుగు శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు దసరా కి టెలికాస్ట్ చేయబోతున్నారట… అప్పుడే ఓకే చెప్పి ఉంటే… 25 కోట్ల రేటు దక్కేది కానీ ఇప్పుడు 10.5 కోట్ల తక్కువగా ఏడాది పైగా గ్యాప్ తీసుకుని టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇక TRP ఎలా ఉంటుందో చూడాలి…