కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ ప్రస్తుతం కోలివుడ్ లో భారీ క్రేజ్ ఉన్న హీరోగా మారాడు, సూపర్ స్టార్ రజినీ ని కూడా దాటే రేంజ్ క్రేజ్ ని ప్రస్తుతం కోలివుడ్ లో ఎంజాయ్ చేస్తున్న విజయ్, రీసెంట్ మూవీస్ తో బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేస్తూ దూసుకు పోతుండగా తన కెరీర్ లో అల్టిమేట్ ట్రాక్ రికార్డ్ ను మెయిన్ టైన్ చేస్తున్నాడు విజయ్…
కానీ ఇప్పుడు తొలిసారి దానికి బ్రేక్ పడబోతుంది, దానికి కారణం కూడా విజయ్ కాదు కరోనా…. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలు పెట్టిన విజయ్ హీరోగా 1992 లో సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు 2020… ఈ 28 ఏళ్లలో….
విజయ్ ప్రతీ ఏడాది కూడా మినిమమ్ లో మినిమమ్ 1 సినిమా అయినా రిలీజ్ చేస్తూ వచ్చాడు, కొన్ని సార్లు మాత్రమె 1 సినిమా రిలీజ్ చేయగా మిగిలిన సార్లు మాత్రం ప్రతీ సారి రెండు మూడు సినిమాల తో తన జోరు చూపుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు మొట్ట మొదటి సారి హీరో అయిన తర్వాత…
ఒక ఏడాది గ్యాప్ రావడం ఈ 2020 కే జరుగుతుంది, ఈ ఇయర్ కూడా మాస్టర్ సినిమా ను కంప్లీట్ కూడా చేసినప్పటికీ కరోనా వలన రిలీజ్ కి నోచుకోలేదు, దీపావళి కి రిలీజ్ అనుకున్నా పరిస్థితులు సద్దుకోవట్లేదు కాబట్టి ఇక ఈ ఏడాది సినిమా లేనట్టే అని యూనిట్ ఆల్ మోస్ట్ కన్ఫాం చేసి సినిమాను ఇప్పుడు…
వచ్చే ఏడాది సంక్రాంతి రేసు లో నిలప బోతుందని సమాచారం… దాంతో ఇక 2020 ఇయర్ లో విజయ్ సినిమా రిలీజ్ అవ్వడం లేదని కన్ఫాం అవ్వగా 28 ఏళ్ల కెరీర్ లో మొట్ట మొదటి సారి ఒక ఏడాది ని ఒక్క సినిమా కూడా రిలీజ్ లేకుండానే ముగించబోతున్నాడు విజయ్, కావాలని చేయకున్నా పరిస్థితుల వలన ఈ ఏడాది మిస్ చేసుకోబోతున్నాడు.